కొడుకు రాజారెడ్డి పెండ్లి తేదీని వెల్లడించిన వైఎస్ షర్మిల.. వధువు ఎవరంటే?

షర్మిల్ ట్వీట్ ప్రకారం.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియాతో ..

YS Sharmila

YS Sharmila Son YS Raja Reddy engagement : నూతన సంవత్సరం వేళ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కీలక విషయాన్ని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు, వైఎస్ఆర్ అభిమానులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన ఆమె.. తన కుమారుడు వివాహ వేడుక తేదీ, తనకు కాబోయే కోడలు వివరాలను ట్విటర్ వేదికగా వెల్లడించారు.

Also Read : Drunk and Drive Tests : హైదరాబాద్‌లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. ఎంతమంది పట్టుబడ్డారో తెలుసా..?

షర్మిల్ ట్వీట్ ప్రకారం.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల అన్నారు. రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషంగా ఉందంటూ షర్మిల ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్విటర్ ఖాతాలో కొడుకు వై.ఎస్. రాజారెడ్డి, కోడలు అట్లూరి ప్రియ కలిసిఉన్న ఫొటోలను షర్మిల షేర్ చేశారు.

Also Read ; Gold Price Today: 2024 సంవత్సరం తొలిరోజు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..

షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఇటీవలే విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేశారు. కుమారుడు రాజారెడ్డి ఎంఎస్, కుమార్తె అంజలి రెడ్డి బీబీఏ పూర్తి చేసిన సందర్భంగా విదేశాల్లో ఓ యూనివర్శిటీలో డిగ్రీ పట్టాలు అందుకున్నారు. ఆ సమయంలో వారితో కలిసి తీసుకున్న ఫొటోలను షర్మిల తన ట్విటర్ ఖాతాలో ఇటీవల షేర్ చేశారు. అయితే, అట్లూరి ప్రియాతో వైఎస్ రాజారెడ్డి ప్రేమలో ఉన్నట్లు, త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనికితోడు ప్రియా, రాజారెడ్డి కలిసితీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. రాజారెడ్డి, ప్రియాల కులాలు వేరువేరు కావడంతో  వీరిపెళ్లికి కుటుంబ సభ్యులు ఓకే చెబుతారా అనే చర్చసైతం కొనసాగింది. ఇటీవల విజయమ్మ ప్రియాకు చీర పెట్టిన ఫొటో బయటకు రావడంతో వీళ్ల పెళ్లి వార్తలకు బలం చేకూర్చినట్లైంది. తాజాగా షర్మిల వీరి వివాహ తేదీని కన్ఫార్మ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలెస్‎ వీరిద్దరి పెళ్లికి వేదిక కానున్నట్లు సమాచారం.