Drunk and Drive Tests : హైదరాబాద్‌లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. ఎంతమంది పట్టుబడ్డారో తెలుసా..?
నూతన సంవత్సరం వేడుకల వేళ హైదరాబాద్ లో పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు.

Drunk and Drive Tests
Drunk and Drive Tests In Hyderabad : దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. 2023 సంవత్సరానికి ప్రజలు వీడ్కోలు పలికి.. 2024 సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల్లోనూ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. యువతీ, యువకులు, మహిళలు, చిన్నారులు, పెద్దలు ప్రతీఒక్కరూ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని 2024 సంవత్సరానికి స్వాగతం పలికారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్యాన్స్ లు, బైక్ ర్యాలీలు, కేక్ లు కట్ చేయడంతో పాటు టపాసులు పేల్చుతూ యువత సందడి చేశారు. కొందరు మద్యం మత్తులో మునిగిపోయారు. ఈ క్రమంలో మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారికి పోలీసులు గట్టి షాకిచ్చారు. హైదరాబాద్ లో భారీ సంఖ్యలో మద్యం బాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : Gold Price Today: 2024 సంవత్సరం తొలిరోజు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..
నూతన సంవత్సరం వేడుకల వేళ హైదరాబాద్ లో పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పలు చోట్ల పోలీసులతో వాహనదారులు వాగ్వివాదానికి దిగారు. న్యూ ఇయర్ రోజు మద్యం సేవించకుండా ఆంక్షలు పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం హైదరాబాద్ నగరం వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మూడు కమిషనరేట్ల పరిధిలో 3,258 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేసిన 1500 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాచకొండ పరిధిలో 517 మందిపై కేసులు పోలీసులు కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలతో సహా 1239 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 938 ద్విచక్ర వాహనాలు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలు స్వాధనీం చేసుకున్నారు.
Also Read : Cold Intensity: రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి.. హైదరాబాద్ సహా ఏడు జిల్లాల ప్రజలకు హెచ్చరికలు..
తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు న్యూఇయర్ జోష్ లో మునిగిపోగా.. పోలీసులు మాత్రం తమ పనిలో నిమగ్నమయ్యారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులకు షాకిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన రహదారులపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో పలువురు వాహనదారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.