Celebrity Cricket League 2024
Celebrity Cricket League 2024 : 2024 సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గ్రాండ్‌గా మొదలు కాబోతోంది. గతేడాది లాగే ఈసారి 8 సినీ పరిశ్రమల నుండి 8 టీమ్స్ సెలబ్రిటీ లీగ్ ఆడటానికి రెడీ అవుతున్నాయి. బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, కర్నాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబయి హీరోస్, తెలుగు వారియర్స్, పంజాబ్ డీ షేర్స్, భోజ్‌పురి దబాంగ్స్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తలపడబోతున్నాయి.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2024 పదవ సీజన్ ఫిబ్రవరి 23న ప్రారంభం కాబోతోంది. ప్రారంభ మ్యాచ్ ఆ రోజు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. షార్జాలో జరిగే ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో ముంబయి హీరోస్, కేరళ స్ట్రైకర్స్ తలపడనుంది. ఈ సీజన్ లో 8 సినీ ఇండస్ట్రీల నుండి 8 టీమ్ లు పాల్గొంటున్నాయి. ప్రముఖ సినీ ఇండస్ట్రీలకు చెందిన ఇంతమంది నటులు క్రికెట్ ఆడబోతుండటంతో ఈ లీగ్ ఆసక్తికరంగా మారనుంది.
Sai Pallavi : చెల్లి ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసిన సాయి పల్లవి..
కర్నాటక బుల్డోజర్స్ : కన్నడ ఇండస్ట్రీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జట్టుకు కిచ్చా సుదీప్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. అశోక్ ఖేనీ ఈ జట్టు యజమాని కాగా.. సునీల్ రావు, శివ రాజ్‌కుమార్, కిచ్చా సుదీప్, గణేష్, రాజీవ్ హెచ్, అర్జున్ యోగి, కృష్ణ, సౌరవ్ లోకేష్, చందన్, నిరూప్ భండారి, జయరామ్ కార్తీక్, నంద కిషోర్, సాగర్ గౌడ, ప్రసన్న ఈ టీమ్ ప్లేయర్లుగా ఉన్నారు.
బెంగాల్ టైగర్స్ : బెంగాలీ ఇండస్ట్రీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జట్టుకి జిషు సేన్ గుప్తా కెప్టెన్ కాగా.. బోనీ కపూర్ యజమానిగా ఉన్నారు. సుమన్, నంది, మోహన్, జాయ్, దేబు, ఇంద్రశిష్, జమ్మీ, రత్నదీప్, జో, వివేక్, శాండీ, మాంటీ, సుశీల్, సుశీల్, ఉదయ్ ఈ టీమ్ ప్లేయర్లుగా ఉన్నారు.
Little Miss Naina : #90s సిరీస్ తర్వాత మరో కొత్త సినిమా.. ఈసారి పొట్టి పొడుగు కాన్సెప్ట్‌తో..
ముంబయి హీరోస్ : బాలీవుడ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ టీమ్‌కు రితేష్ దేశ్‌ముఖ్ కెప్టెన్ కాగా సోహైల్ ఖాన్ యజమానిగా ఉన్నారు. సునీల్ శెట్టి, బాబీ డియోల్, సల్మాన్ ఖాన్, అఫ్తాబ్ శివదాసాని, సమీర్ కొచ్చర్, శరద్ కేల్కర్, షబ్బీర్ అహ్లువాలియా, వత్సల్ సేథ్, సాహిల్ చౌదరి, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, వరుణ్ బడోలా, అపూర్వ క్హేని, అపూర్వ క్హేని , తుషార్ జలోటా, కబీర్ సదానంద్, సాకిబ్ సలీమ్ ప్లేయర్లుగా ఉన్నారు.
తెలుగు వారియర్స్ : టాలీవుడ్ నుండి అక్కినేని అఖిల్ కెప్టెన్ కాగా సచిన్ జోషి యజమానిగా ఉన్నారు. సచిన్ జోషి, తరుణ్, నంద కిషోర్, విశ్వ, సాయి ధరమ్ తేజ్, సామ్రాట్ రెడ్డి, ఖయ్యూమ్, ఆదర్శ్ బాలకృష్ణ, హరీష్, ప్రిన్స్, తారక రత్న, నిఖిల్, రఘు, అశ్విన్ బాబు, సుశాంత్ ప్లేయర్లుగా ఉన్నారు.
Kurchi Tata : కుర్చీ తాతపై వరస కంప్లైట్లు.. ఇదేం గొడవరా సామీ..
కేరళ స్ట్రైకర్స్ : మళయాళ ఇండస్ట్రీ నుండి కుంచకో బోబన్ కెప్టెన్ కాగా.. రాజ్ కుమార్, శ్రీప్రియ యజమానులుగా వ్యవహరిస్తున్నారు. ఉన్ని ముకుందన్, వివేక్ గోపన్, సైజు కురుప్, మణికుట్టన్, అర్జున్ నందకుమార్, సిద్ధార్థ్ మీనన్, షఫీక్ రెహమాన్, నిఖిల్ కె మీనన్, విజయ్ యేసుదాస్, ప్రజోద్ కళాభవన్, జీన్ పాల్ లాల్, సంజు శివరామ్, ఆసిఫ్ అలీ, రాజీవ్ పిళ్లై, ప్రశాంత్ అలెగ్జాండర్, సిజు విల్సన్ ప్లేయర్లుగా ఉన్నారు.
చెన్నై రైనోస్ : తమిళ ఇండస్ట్రీ నుండి ఆర్య కెప్టెన్ కాగా.. కె.గంగా ప్రసాద్ యజమానిగా ఉన్నారు. శివ. పృథ్వీ, విష్ణు, కలైయరసన్, దాశరథి, భరత్, విక్రాంత్, ఆధవ్, శంతను, రమణ, అశోక్ సెల్వన్, బాల శరవణన్, జీవా, సత్య, శరణ్ ప్లేయర్లుగా ఉన్నారు.
Bade Miyan Chote Miyan Teaser : ‘బడే మియా ఛోటే మియా’ తెలుగు టీజర్ వచ్చేసింది..
భోజ్‌పురి దబాంగ్స్ : భోజ్‌పురి పరిశ్రమ నుండి మనోజ్ తివారీ కెప్టెన్ కాగా.. యజమానిగా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు. దినేష్ లాల్ యాదవ్ (వైస్ కెప్టెన్), రవి కిషన్, ప్రవేశ్ లాల్ యాదవ్, ఉదయ్ తివారీ, రాహుల్ సింగ్, అజోయ్ శర్మ, ప్రకాష్ జైస్, అయాజ్ ఖాన్, సుశీల్ సింగ్, అభయ్ సిన్హా, ఖేసరీ లాల్ యాదవ్, జే యాదవ్, సూర్య ద్వివేది, వికాష్ సింగ్, పవన్ సింగ్, సంతోష్ సింగ్, అజయ్ శ్రీవాస్తవ్, విక్రాంత్ సింగ్ రాజ్‌పూత్, అనిల్ సామ్రాట్ ప్లేయర్లుగా ఉన్నారు.
పంజాబ్ డీ షేర్స్ : పంజాబీ పరిశ్రమ నుండి సోనూ సూద్ కెప్టెన్ కాగా.. నవరాజ్ హన్స్, పునీత్ సింగ్ యజమానులుగా ఉన్నారు. ఆయుష్మాన్ ఖురానా, జిమ్మీ షెర్గిల్, మికా సింగ్, బిన్ను ధిల్లాన్, రాహుల్ దేవ్, హర్మీత్ సింగ్, రాజు శర్మ, అంగద్ బేడీ, పీయూష్ మల్హోత్రా, యువరాజ్ హన్స్, గుల్జార్ చాహల్, అమ్రీందర్ గిల్, రోషన్ ప్రిన్స్, మన్వీర్ స్రాన్, నవరాజ్ హన్స్, దిల్రాజ్ ఖురానాలు ప్లేయర్లుగా ఉండబోతున్నారు.
Shobha Shetty : పెళ్లి తాంబూలాలు వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ శోభాశెట్టి..
అన్ని సినీ ఇండస్ట్రీల నుండి ప్రముఖ సినీ నటులు ఆడబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ లు చూడటానికి అనేకమంది సెలబ్రిటీలు అటెండ్ కాబోతున్నారు. ఈ మ్యాచ్ ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇక ఫిబ్రవరి నెలలో పండగ అని చెప్పాలి.