Little Miss Naina : #90s సిరీస్ తర్వాత మరో కొత్త సినిమా.. ఈసారి పొట్టి పొడుగు కాన్సెప్ట్‌తో..

'#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అందర్నీ ఎంటర్టైన్ చేసిన ఈటీవీ విన్.. ఇప్పుడు పొట్టి పొడుగు కాన్సెప్ట్‌తో 'లిటిల్ మిస్ నైనా' అనే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్..

Little Miss Naina : #90s సిరీస్ తర్వాత మరో కొత్త సినిమా.. ఈసారి పొట్టి పొడుగు కాన్సెప్ట్‌తో..

Telugu new movie Little Miss Naina is now streaming on EtvWin

Updated On : January 25, 2024 / 3:21 PM IST

Little Miss Naina : డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ పోటీలోకి వచ్చిన మరో తెలుగు ఓటీటీ EtvWin. ఇక ఇప్పుడిప్పుడే కొత్త కంటెంట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తూ.. తన వ్యూయర్ షిప్ ని పెంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇటీవల ‘#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి సూపర్ హిట్టుని అందుకున్నారు.

ఇప్పుడు మరో కొత్త కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ‘లిటిల్ మిస్ నైనా’ అనే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని నేటి (జనవరి 25) నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తమిళ చిత్రం ’96’ (తెలుగులో జాను) ఫేమ్ గౌరీ కిషన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. షేర్షా షెరీఫ్ మేల్ లీడ్‌లో హీరోగా కనిపిస్తున్నారు. కొత్త దర్శకుడు విష్ణు దేవ్ ఈ సినిమాని తెరకెక్కించారు.

Also read : Bade Miyan Chote Miyan Teaser : ‘బడే మియా ఛోటే మియా’ తెలుగు టీజర్ వచ్చేసింది..

ఇక ఈ సినిమా కథాంశం పొట్టి, పొడుగు కాన్సెప్ట్‌తో అందరినీ నవ్వించేలా సాగుతుంది. హీరోయిన్ 4 అడుగులు ఉంటే, హీరో 6 అడుగులు హైట్ ఉంటారు. అంతేకాదు హీరోయిన్ కి OCD సమస్య కూడా ఉంది. ఇక హీరోయిన్ చదువుల సరస్వతి అయితే, హీరోకి సినిమా అంటే ప్యాషన్. ఇలాంటి వీరిద్దరూ ప్రేమలో పడి, పారిపోయి పెళ్లి చేసుకొని, ఎదుర్కొన్న సమస్యలు ఏంటి..? అనేదాని చాలా వినోదభరితంగా చూపించారు.

96 చిత్రానికి సంగీతం అందించిన గోవింద్ వసంత ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. సుతిన్ సుగతన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మూవీ ట్రైలర్ చూస్తుంటే #90s లాగానే ఈ సినిమా కూడా ఒక ఫీల్ గుడ్ కంటెంట్ తో అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. మరి ఆ సినిమాని మీరుకూడా చూసేయండి.