Bade Miyan Chote Miyan Teaser : ‘బడే మియా ఛోటే మియా’ తెలుగు టీజర్ వచ్చేసింది..
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'బడే మియా ఛోటే మియా' తెలుగు టీజర్ వచ్చేసింది..

Akshay Kumar Tiger Shroff Bade Miyan Chote Miyan Telugu Teaser released
Bade Miyan Chote Miyan Telugu Teaser : బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘బడే మియా ఛోటే మియా’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. సుల్తాన్, టైగర్ జిందా హై వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ ఏడాది రంజాన్ కి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి టైం ఫిక్స్ చేసుకుంది. ఇక రిలీజ్ కి రెండు నెలల సమయం ఉండడంతో మూవీ టీం ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈక్రమంలోనే మూవీ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో తెలుగు టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.
భారత సైనికులు, టెర్రరిస్ట్, దేశభక్తితో ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే రోబోటిక్ టెక్నాలజీతో కూడా ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నారని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. మొత్తానికి టీజర్ అయితే పవర్ ప్యాకెడ్ సన్నివేశాలతో అదిరిపోయింది. ఈ రంజాన్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మరి ఆ టీజర్ వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
కాగా ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, మనుషి చిల్లర, అలయా ఎఫ్ ఫిమేల్ లీడ్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వశు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌శిఖ దేశముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాంశు కిషన్ మెహ్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ మిశ్ర సాంగ్స్ కంపోజ్ చేస్తుంటే, జూలియస్ ప్యాకియం నేపధ్య సంగీతం సమకూరుస్తున్నారు.