Kurchi Tata : కుర్చీ తాతపై వరస కంప్లైట్లు.. ఇదేం గొడవరా సామీ..

పాపులారిటీ కోసం పాకులాడే వారు కొందరైతే.. వచ్చిన లక్‌ని చెడగొట్టుకుంటారు కొందరు. కుర్చీ తాత తీరు అలాగే ఉంది. 'కుర్చీని మడతపెట్టి' పాటతో వచ్చిన పాపులారిటీ కాస్త తుడిచిపెట్టుకుపోతోంది.

Kurchi Tata : కుర్చీ తాతపై వరస కంప్లైట్లు.. ఇదేం గొడవరా సామీ..

Kurchi Tata

Kurchi Tata : సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఎంత ఊపు ఊపిందో తెలిసిందే. అసలు ఈ పాటకు కారణమైన కుర్చీతాత ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారు. పాపం.. ఆ పేరుని కొంచెం కూడా నిలబెట్టుకోలేకపోయారు. రీసెంట్‌గా ఆయన మీద పలు కంప్లైంట్లు రావడంతో పోలీసులు అరెస్టు చేసారు.

Ananya Panday : బాబోయ్.. ర్యాంప్ వాక్‌లో అనన్య పాండే డ్రెస్ చూడండి.. ఎంత విచిత్రంగా ఉందో…

ఆ మధ్య కుర్చీ తాత డైలాగ్ డైలాగ్ ‘కుర్చీని మడత పెట్టి’ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యింది. చాలామంది రీల్స్ కోసం తెగ వాడేసుకున్నారు. ఈ డైలాగ్‌ను గుంటూరు కారం సినిమాలో పాటకోసం వాడుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. దాంతో ఆ పాట మారుమోగడమే కాదు.. కుర్చీ తాత మామూలుగా ఫేమస్ కాలేదు. ఈ డైలాగ్ వాడుకున్నందుకు ఆయనకు పేరుతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుండి ఆర్థిక సాయం కూడా అందిందట.  ఎవరికైనా లక్ కలిసొచ్చి మంచి పేరొస్తే దానిని ఎలా నిలబెట్టుకోవాలని ఆలోచిస్తారు. కానీ కుర్చీతాత మాత్రం వచ్చిన పేరు పోగొట్టేసుకుంటున్నారు.

కుర్చీతాతకు తమన్ నుండి సాయం అందడంలో వైజాగ్ సత్య సాయం చేసారట. అది మర్చిపోయి తనను ధూషిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పెట్టారంటూ కుర్చీతాతపై పోలీసులకు ఫిర్యాదు చేసారు వైజాగ్ సత్య. ఇదిలా ఉంటే కుర్చీతాత తనను బూతులు తిడుతున్నాడంటూ స్వాతినాయుడు సైతం పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కుర్చీతాతను అరెస్టు చేసారు. కొందరు యూట్యూబర్స్ మందు పోయించి వాళ్లని తిట్టమనడంతో అలా చేసానని చెబుతున్నారట కుర్చీ తాత.

Animal : యానిమల్ ఓటీటీ రిలీజ్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

కుర్చీతాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్ కృష్ణ కాంత్ పార్క్ వద్ద ఉండే కుర్చీతాత భార్య, పిల్లల్ని పట్టించుకోకుండా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారని ఆరోపణలు వస్తున్నాయి. ఒకే ఒక్క డైలాగ్‌తో పాపులరై సినిమా పాటకు తన డైలాగ్ వాడే రేంజ్‌కి పేరు తెచ్చుకుని సంపాదించుకున్న పేరుని కాస్త చెడగొట్టుకుంటున్నారు కుర్చీ తాత.