Ananya Panday : బాబోయ్.. ర్యాంప్ వాక్‌లో అనన్య పాండే డ్రెస్ చూడండి.. ఎంత విచిత్రంగా ఉందో…
లైగర్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. తాజాగా పారిస్‌లో జరిగిన ర్యాంప్ షోలో వింత డ్రెస్‌లో మెరిసారు ఈ భామ.

Ananya Panday
Ananya Panday : ‘లైగర్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండేకు ఇక్కడ నిరాశ ఎదురైనా బాలీవుడ్‌లో మాత్రం దూసుకుపోతున్నారు. తాజాగా ఈ బ్యూటీ పారిస్‌లో జరిగిన ఫ్యాషన్ షోలో వింత డ్రెస్‌తో ర్యాంప్ వాక్ చేశారు. అనన్య ర్యాంప్ వాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ యాక్టర్ చంకీ పాండే తెలియని వారుండరు. ఆయన కూతురే అనన్య పాండే. 2019 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతి పత్నీ ఔర్ ఓ సినిమాలతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. 2023లో అనన్య నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ కమర్షియల్ హిట్ అయ్యి కోట్లు కొల్లగొట్టింది. అదే సంవత్సరం విడుదలైన ‘రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’లో ఐటమ్ సాంగ్‌లో మెరిసారు అనన్య. సిద్ధాంత్ చతుర్వేది, ఆదర్శ్ గౌరవ్‌లతో అనన్య నటించిన ‘క్యో గయే హమ్ కహా’ గతేడాది డిసెంబర్ 26 న సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది.
Fighter Twitter Review : హృతిక్ రోషన్ ‘ఫైటర్’ పబ్లిక్ టాక్ ఏంటి..? ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది..?
తాజాగా అనన్య పారిస్‌లో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో విచిత్రమైన డ్రెస్ ధరించి ర్యాంప్ వాక్ చేయడం వైరల్‌గా మారింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఇండియన్ డిజైనర్ రాహుల్ మిశ్రాను రిప్రెజెంట్ చేస్తూ బాలీవుడ్ యంగెస్ట్ యాక్ట్రెస్ అనన్య చేసిన ర్యాంప్ వాక్ అదరహో అనిపించింది. ఆమె చేసిన ర్యాంప్ వాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram