UPMA: ప్యూమా కాదు.. ఉప్మా బ్రాండ్ షూ.. ఏడాది క్రితమే ఉప్మాను మించిన మరో బ్రాండ్ షూ.. ఆనంద్ మహీంద్ర ఏమన్నారు?

UPMA, PUMA రెండు పదాల్లోని అక్షరాలు ఒకేలా కనపడుతుండడంతో ప్యూమా అనుకుని ఉప్మా బ్రాండ్ షూ కొంటారని ఆ వ్యాపార మేధావుల ఆలోచన.

UPMA: ప్యూమా కాదు.. ఉప్మా బ్రాండ్ షూ.. ఏడాది క్రితమే ఉప్మాను మించిన మరో బ్రాండ్ షూ.. ఆనంద్ మహీంద్ర ఏమన్నారు?

PUMA - UPMA

Updated On : August 13, 2023 / 6:02 PM IST

UPMA – PUMA: ఉప్మా.. దక్షిణాదిన అందరూ ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్. ప్యూమా.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వాడుతున్న జర్మనీ బ్రాండ్. ఇంగ్లిష్‌లో PUMA పదంలో PUని తారుమారు చేసి UP పెడితే ఏమవుతుంది? UPMA అవుతుంది. ప్యూమా బ్రాండ్ ని కాపీ చేస్తూ UPMA బ్రాండ్ వచ్చేసింది.

UPMA, PUMA రెండు పదాల్లోని అక్షరాలు ఒకేలా కనపడుతుండడంతో ప్యూమా అనుకుని ఉప్మా బ్రాండ్ షూ కొంటారని ఆ వ్యాపార మేధావుల ఆలోచన. ఒక్క ఉప్మా బ్రాండేనా? Ajitdas బ్రాండ్ ఎప్పుడో వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టింది. ఈ అజిత్‌దాస్ ఏంటని అనుకుంటున్నారా?

జర్మనీకి చెందిన మరో కంపెనీ బ్రాండ్ Adidasకి Ajitdas నకిలీగా వచ్చిందనమాట. ఈ Ajitdas గురించి భారత పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర గత ఏడాది నవంబరులో ఓ ట్వీట్ చేశారు. అప్పట్లో ఆ ట్వీట్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు తనకు ఓ వ్యక్తి UPMA బ్రాండ్ కు సంబంధించిన ఓ ఫొటోను పంపాడని ఆనంద్ మహీంద్ర ఇవాళ ట్విట్టర్ లో తెలిపారు.

గతంలో తాను హాస్యాస్పద దేశీ వెర్షన్ Ajitdas గురించి కూడా చెప్పానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు UPMA బ్రాండ్ భారతీయీకరణకు మరో కొత్త ఉదాహరణగా నిలిచిందని ఎద్దేవా చేశారు. ఈ రీసైకిల్ చేసిన/స్థిరమైన పాదరక్షలు మనకు ఉన్నాయని, జాగింగ్ చేసిన తర్వాత హాయిగా బ్రేక్ ఫాస్ట్ చేయొచ్చేమోనని చురకలు అంటించారు. కాగా, బాటా (bata) బ్రాండ్ ని అనుకరిస్తూ బాలా (bala) అనే బ్రాండ్ పేరుతో కస్టమర్లను కన్‌‌ఫ్యూజ్ చేస్తూ పాదరక్షలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారూ ఉన్నారు.

ఆనంద్ మహీంద్ర ఇవాళ చేసిన ట్వీట్

ఆనంద్ మహీంద్ర గత ఏడాది నవంబరులో చేసిన ట్వీట్

 

Crime: భలే భలే మగాడివోయ్.. డ్రైనేజీలో దాక్కున్న దొంగ.. అయినా అందులో ఉన్నాడని ఎలా గుర్తించారో తెలుసా?