హీరోలా స్టైల్ కొడుతూ…సిగ‌రెట్ తాగుతున్న పీత

  • Published By: venkaiahnaidu ,Published On : September 21, 2020 / 08:21 PM IST
హీరోలా స్టైల్ కొడుతూ…సిగ‌రెట్ తాగుతున్న పీత

Updated On : September 21, 2020 / 8:34 PM IST

ధూమ‌పానం మనుషులకే సాధ్య‌మా… మేము చేయ‌లేమా అంటూ ఓ పీత స్టైల్ గా ఒక రేంజ్‌లో సిగ‌రెట్ తాగుతున్న ఒక వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. పీతకి సిగ‌రెట్ తాగ‌డం ఎవ‌రు నేర్పించారో, ఎక్క‌డ చూసిందో కాని అచ్చం హీరోలా స్టైల్ కొడుతూ పొగ‌తాగింది. బీచ్ ‌లో అటుగా వెళ్తున్న కొంత‌మంది దీనిని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. వెంట‌నే ఈ సంఘ‌ట‌న‌ను తమ కెమెరాలో బంధించారు.


ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ఇప్పుడు ఈ వీడియోను ట్విట‌ర్ ‌లో షేర్ చేశారు. 31 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో పీత సిగ‌రెట్ తాగ‌డం చూడొచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అయితే, మ‌నుషులు చేసే ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం వ‌ల్ల అమాయ పీత‌లు బ‌ల‌వుతున్నాయంటూ వీడియో చూసిన కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.