Hyderabad Tenants : ఇంటి పనిమనిషికి హిందీ రాదని పనిలో నుంచి తీసేశారట.. హైదరాబాదీ పోస్టుకు నెటిజన్ల రియాక్షన్..!

Hyderabad Tenants : ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో అద్దెకు ఉంటున్న కొందరు ప్లాటులో తమతో హిందీలో కమ్యూనికేట్ చేయలేకపోయిందని పనిమనిషిని తొలగించాలని డిసైడ్ అయ్యారట.. దీనిపై నెటిజన్లు ఇలా స్పందిస్తున్నారు.

Hyderabad Tenants : ఇంటి పనిమనిషికి హిందీ రాదని పనిలో నుంచి తీసేశారట.. హైదరాబాదీ పోస్టుకు నెటిజన్ల రియాక్షన్..!

Hyderabad Tenants Want To Fire Help Because _She Can't Speak Hind ( Image Source : Google )

Hyderabad Tenants : ప్రస్తుత రోజుల్లో టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు.. భాషా నైపుణ్యం కూడా ఉండాలి. అప్పుడే దేశంలో ఎక్కడికి వెళ్లినా ఇబ్బందిలేకుండా బతికేయొచ్చు. అదేగానీ, భాష రాకుంటే మాత్రం ఆ ఇబ్బందులను మాటల్లో చెప్పలేం.. కమ్యూనికేషన్ ఎలా చేయాలో తెలియక సతమతమవుతుంటారు. వారు ఏం చెబుతున్నారో వీరికి అర్థం కాదు.. మొత్తానికి అంతా గందరగోళానికి దారితీస్తుంది. ఇలాంటి ఘటనే మన హైదరాబాద్‌లో జరిగింది. అదే విషయాన్ని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి రెడ్డిట్‌లో ఓ ఛాలెంజింగ్ అనుభవాన్ని షేర్ చేశాడు.

Read Also : Zomato Veg Meal : వెజ్ మీల్‌ ఆర్డర్ చేస్తే.. చికెన్ ముక్క ప్రత్యక్షం.. కస్టమర్ ఫిర్యాదుతో జొమాటో క్షమాపణలు..!

తాను ఉండే అపార్ట్‌మెంటులో తోటి ఫ్లాట్‌మేట్‌లు నార్త్ నుంచి వచ్చారు. వారు హిందీ మాత్రమే మాట్లాడుతారు. తెలుగు అసలు తెలియదు. దాంతో హిందీలో వారితో కమ్యూనికేట్ చేయలేనందున వారి ప్లాటులో పనిచేసే పనిమనిషిని పని నుంచి తొలగించాలని డిసైడ్ అయ్యారట.. ఈ సంఘటనను వివరించిన తర్వాత రెడ్డిట్ యూజర్లలో ఎవరైనా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారా అని హైదరాబాదీ అడిగారు. ఈ ప్రశ్నకు నెటిజన్లు ఒక్కొక్కరుగా తమకు ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

“నేను మరో ఇద్దరు ఫ్లాట్‌మేట్‌లతో కలిసి 3BHKలో నివసిస్తున్నాను. వారిద్దరికీ తెలుగు రాదు. రెండు నెలల క్రితం ఫ్లాట్‌లోకి మారారు. మా ప్రాంతంలో చాలా మంది పనిమనిషిల కన్నాశుభ్రం చేసే తెలుగు మాట్లాడే పనిమనిషి ఉంది. ఆమె గత 1.5 సంవత్సరాలుగా ఫ్లాట్‌లో పని చేస్తున్నారు. ఈ కుర్రాళ్ళు ఆమెకు హిందీ రాదని పనిలో నుంచి తీసేయాలని అనుకుంటున్నారు. వాస్తవానికి ఆమె హిందీని అర్థం చేసుకోగలదు. ఆమెతో కమ్యూనికేట్ చేయగలరు. నేను సాధారణంగా ఇదే విషయాన్ని ట్రాన్సులేట్ చేసి చెబుతుంటాను. ఆ పరిస్థితిని ఆమెకు వివరించినప్పుడు ఇంటి పనిమనిషి కన్నీళ్లు పెట్టుకుంది” అని హైదరబాదీ వివరించాడు.

What happens in Bengaluru today will definitely go to Hyderabad tomorrow 🙂
byu/Aggravating_Nail4108 inBengaluru

ఈ పోస్ట్ కొన్ని రోజుల క్రితం రెడ్డిట్‌లో షేర్ అయింది. 500 కన్నా ఎక్కువ అప్‌వోట్‌లు, అనేక కామెంట్లు వచ్చాయి. “ఆమె తన సొంత రాష్ట్రంలోనే సొంత భాష మాట్లాడటం వల్ల పని కోల్పోవాల్సి రావడం నమ్మలేకపోతున్నాను. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు”అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. “కంపెనీలలో కూడా ఇది జరుగుతోంది. ఒక హిందీ హెచ్ఆర్ వ్యక్తి నియామక ప్రక్రియను చాలా తారుమారు చేసిన విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. అతను స్థానిక అభ్యర్థులందరినీ మెరిట్‌ ఉన్నా తిరస్కరించాడు. సంబంధిత అనుభవం లేని నిరక్షరాస్యులైన హిందీ అభ్యర్థులందరికి ఉద్యోగమిచ్చాడు. నేను నియామక నిర్వాహకుడిని కాబట్టి ఆ తరువాత ప్రక్రియను నియంత్రించాను. కానీ ఈ హెచ్ఆర్ ధైర్యం చూసి నేను ఆశ్చర్యపోయాను ”అని మరో యూజర్ తన అభిప్రాయాన్ని షేర్ చేశారు.

“నేను హిందీ మాట్లాడతాను. మా పనిమనిషి తెలుగు మాట్లాడుతుంది. ఆమె బాగా పని చేస్తుంది. నా ఇతర ఇద్దరు ఫ్లాట్‌మేట్స్ తెలుగు మాట్లాడటం మల్ల ఆమెతో నాకు కమ్యూనికేషన్ సమస్య ఎప్పుడూ లేదు. పనిమనిషికి ఆమె ఏమి చేయాలో ఇప్పటికే తెలుసు. నేను నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆమె ఇతర రాష్ట్రాల నుంచి వచ్చింది. అనారోగ్యంతో ఉన్నందున ఆమె పనిలోకి రాలేదని మీ రూమ్‌మేట్‌లు అర్థం చేసుకోకుండా ఎలాంటి సానుభూతి లేదని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

Read Also : Breathtaking Video : సముద్రగర్భంలో అద్భుతం.. మాల్దీవులలో బ్లూ వేల్‌కు పోటీగా డైవర్ సాహసం..!