Road Accident : దేవాలయానికి వెళుతుండగా ప్రమాదం .. ఎనిమిదిమంది మృతి

Road Accident : దేవాలయానికి వెళుతుండగా ప్రమాదం .. ఎనిమిదిమంది మృతి

Road accident in Odisha

Updated On : December 1, 2023 / 10:32 AM IST

Road accident in Odisha : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ఓ ట్రక్రును ఓ వ్యాన్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. గంజాంలోని దిగపహండి నుంచి కెంధూఝర్ జిల్లాలోని ఘటగావ్ లోని తారిణి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

తారణి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ లో 20మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ముగ్గురు మహిళలతో సహా ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి స్థానికుల సహాయంతో గాయపడినవారిని సమీపంలోనే ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ గంజాం జిల్లాలోని పొడమరి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

కాగా..భారతదేశంలో ఉన్న శక్త పీఠాల్లో ఒడిశాలోని తారా తారణి దేవాలయం ఒకటి. ఒడిశాలోని బెర్హంపూర్ నుండి 25 కి.మీ దూరంలో ఉందీ దేవాలయం. పార్వతీ దేవి రొమ్ములు పడిన ప్రాంతంగా ఈ దేవాలయం పూజలందుకుంటోంది. తారా, తారిణి అనే జంట దేవతలను ఇక్కడ పూజిస్తారు. ఈ శక్తి పీఠాన్ని కల్యాని ధామ్ అని కూడా పిలుస్తారు.