UK Restaurant : ఎగ్జైటింగ్ జాబ్ : కూర రుచి చెప్పినందుకు నెలకు Rs.50 వేల జీతం
మన అందరికీ నచ్చే బంగాళదుంప కూర.....అలాంటి రోస్టెడ్ పొటాటోలను జస్ట్ టేస్ట్ చేస్తే చాలు నెలకు ఆకర్షణీయ వేతనం ఆఫర్ చేస్తోంది బ్రిటన్‌లోని బోటానిస్ట్ బార్ అండ్ రెస్టారెంట్.

Roasted Potatoes
UK Restaurant : ఏంటి… కూర తిని దాని రుచి చెప్తే నెలకు రూ.50వేల జీతమా … ఎళ్లవయ్యా…. ఎళ్లెళ్ళవయ్యా….. పెద్ద చెప్పావు గానీ అంటారా…. ఇది నిజమండి బాబు …. అయితే అది ఏ కూర అంటారా…..అది మన అందరికీ నచ్చే బంగాళదుంప కూర…..అలాంటి రోస్టెడ్ పొటాటోలను జస్ట్ టేస్ట్ చేస్తే చాలు నెలకు ఆకర్షణీయ వేతనం ఆఫర్ చేస్తోంది బ్రిటన్‌లోని బోటానిస్ట్ బార్ అండ్ రెస్టారెంట్.
కాకపోతే ఆ ఉద్యోగంలో మీరు చేయల్సిందల్లా ఏంటంటే…. ఆ రెస్టారెంట్ వారి పొటాటోలను టేస్ట్ చేస్తే చాలు….. రుచికరమైన రోస్టెడ్ పొటాటోలను లొట్టలేసుకుంటూ తినిపెట్టి దాని రుచిని వర్ణించి చెప్పాలి అలా చెపితే నెల తిరగ్గానే మీకు రూ 50,000 (500 పౌండ్లు) జీతంగా ఇస్తారు. “ మీకు అద్భుతమైన రోస్ట్‌ను ఎలా బిల్డ్ చేయాలో తెలిసి ఉంటే మీ కోసం మేము సరైన వీకెండ్ జాబ్‌ను సిద్ధంగా ఉంచాం..మా రోస్ట్‌ను అందరూ మెచ్చే విలువైన రోస్ట్‌గా మలిచే సత్తా ఉన్న పెయిడ్ రోస్ట్ సమీక్షకుడి కోసం తాము అన్వేషిస్తున్నా”మని రెస్టారెంట్ వెబ్‌సైట్‌లో ప్రకటించింది.
ఎంపికైన అభ్యర్ధి ఈనెల 19వ తేదీ ఆదివారం తమ ప్రియమైన అయిదుగురితో టేస్టింగ్ సెషన్‌కు హాజరు కావాలని కోరింది. రోస్టెడ్ పొటాటోలను టేస్ట్ చేసిన అనంతరం 500 పదాలతో కూడిన సమీక్ష రాయడం లేదా సోషల్ మీడియా వేదికలపై ప్రచారం కోసం 60 సెకండ్ల క్లిప్‌ను రూపొందించాలని రెస్టారెంట్ కోరింది. తమ రివ్యూను ఏ సోషల్ మీడియా వేదికపై షేర్ చేస్తారో వారు ప్రస్తావించాలని పేర్కొంది. సెప్టెంబర్ 12లోగా అభ్యర్ధులు తమ దరఖాస్తులు సమర్పించాలని కోరింది.