గురుకుల స్కూల్లో 10th విద్యార్థిని మృతి : ఆందోళన చేస్తున్న బంధువులు

  • Published By: veegamteam ,Published On : October 31, 2019 / 04:54 AM IST
గురుకుల స్కూల్లో 10th విద్యార్థిని మృతి : ఆందోళన చేస్తున్న బంధువులు

Updated On : October 31, 2019 / 4:54 AM IST

మెదక్ గురుకుల స్కూల్ హాస్టల్ లో విద్యార్థిని మృతి చెందింది. 10వ తరగతి చదువుతున్న కావ్య తీవ్ర అస్వస్థతకు గురైన మృతి చెందింది. దీంతో దీంతో బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెకు అనారోగ్యం చేసినా..స్కూల్  ప్రిన్సిపాల్ తమకు సమాచారం అందించలేదనీ..కనీసం కావ్యకు ట్రీట్ మెంట్ కూడా చేయించలేదని అందుకే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ..ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి..స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారరణమనీ సిబ్బంది బాధ్యత వహించాలనీ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ..బాలిక మృతదేహంతో స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కావ్య తల్లిదండ్రులకు, బంధువులకు నచ్చచెప్పేందుకు యత్నిస్తున్నా..వారి వినటంలేదు. తమకు న్యాయం జరిగేవరకూ విడిచిపెట్టేది లేదని డిమాండ్ చేస్తున్నారు. కానీ..గత మూడు రోజుల క్రితం కావ్యకు అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్ కు తీసుకెళ్లామని ప్రిన్సిపల్  చెబుతున్నారు. తమ బిడ్డ అనారోగ్యం గురించి తెలిసి స్కూల్ ప్రిన్సిపల్ ను ప్రశ్నించామని దారికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని..స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే కావ్య చనిపోయిందని కావ్య తండ్రి అశోక్  ఆరోపిస్తున్నారు.