గిన్నీస్ బుక్‌లో నిజామాబాద్ రికార్డ్
నిజామాబాద్ లో ఎంపీ సీటుకు ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

నిజామాబాద్ లో ఎంపీ సీటుకు ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ సీటు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడటమే ఇందుకు కారణం. నిజామాబాద్‌లో అత్యధిక ఈవీఎంలతో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని.. అతి పెద్ద బ్యాలెట్ యూనిట్ తో ప్రపంచంలో ఇటువంటి ఎన్నిక తొలిసారి నిర్వహించినందున గిన్నీస్ బుక్ రికార్డుల్లో చేర్చాలని కోరుతూ నిర్వాహకులకు లెటర్ రాశామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు.
Read Also : చెక్ చేసుకోండి : ఏపీ ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా ముగించామని రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ కు సహకరించిన ఓటర్లు, రాజకీయ పార్టీలు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అందిన సమచారం మేరకు ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదన్నారు. ఎన్నికల తనఖీల్లో భాగంగా రూ.74.56 కోట్ల విలువైన మద్యం, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పలు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.220 కోట్లు ఉంటుందని తెలిపారు.
2014 ఎన్నికలతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ సీజ్ చేశామని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై 557 కేసులు నమోదయ్యాయని..వారిలో 53 కేసుల్లో నోటీసులు జారీ చేశామని రజత్ కుమార్ తెలిపారు.
Read Also : ఆకతాయి అసభ్య ప్రవర్తన : చెంప పగలగొట్టిన ఖుష్బూ