రోడ్డుపైన మృతదేహాలను వదిలేసిన పోలీసులు: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

  • Published By: vamsi ,Published On : August 25, 2019 / 02:55 PM IST
రోడ్డుపైన మృతదేహాలను వదిలేసిన పోలీసులు: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

Updated On : August 25, 2019 / 2:55 PM IST

తమ పరిధిలోకి రాదంటూ… ఓ యాక్సిడెంట్‌లో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను పోలీసులు రెండు గంటల పాటు అక్కడే వదిలేసిన ఘటన విజయవాడ పట్టణంలోని రామవరప్పాడులో చోటుచేసుకుంది. రామవరప్పాడు పైవంతెన వద్ద ఆదివారం(25 ఆగస్ట్ 2019) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో బైక్‌పై వస్తున్న తండ్రీకొడుకులు అక్కడికక్కడే చనిపోయారు. అయితే ప్రమాదం జరిగిన చోటు మా పరిధిలోకి రాదంటూ స్థానిక పోలీసులు రాకపోవడంతో రెండు గంటలుగా మృతదేహాలు రోడ్డుపైనే ఉండిపోయాయి. మా పరిధి కాదంటూ పోలీసుల మృతదేహాలను రోడ్డుపైనే వదిలేసిన తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.