వామ్మో : 300 కేజీల కుళ్లిన చికెన్ స్వాధీనం
నెల్లూరు జిల్లాలో భారీగా నిల్వ ఉంచిన చికెన్ పట్టుబడింది. ఆటోలో తరలించిన సుమారు 300 కేజీల కుళ్లిన చికెన్ పట్టుకున్నారు.

నెల్లూరు జిల్లాలో భారీగా నిల్వ ఉంచిన చికెన్ పట్టుబడింది. ఆటోలో తరలించిన సుమారు 300 కేజీల కుళ్లిన చికెన్ పట్టుకున్నారు.
నెల్లూరు జిల్లాలో భారీగా నిల్వ ఉంచిన చికెన్ పట్టుబడింది. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి కుళ్లిన చికెన్‌ను నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని చికెన్ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆటోలో తరలించిన సుమారు 300 కేజీల కుళ్లిన చికెన్ పట్టుకున్నారు. వీటిలో నిల్వ చేసిన చికెన్, గుండెకాయలతోపాటు ఇతర భాగాలు ఉన్నాయి. చికెన్ తరలించిన ఆటోను కూడా పంచాయితీ కార్యాలయానికి తరలించారు. చెరువు సమీపంలో పెద్ద గుంత తీసి.. అందులో చికెన్ వేసి.. ఫినాయిల్ చల్లి కప్పిపెట్టారు. పీహెచ్‌సీ డాక్టర్ శశికళ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇలాంటిది తింటే ప్రజలు రోగాల బారిన పడతారని హెచ్చరించారు.
చికెన్ వ్యాపారులు సంపాదన గురించి తప్ప ప్రజల ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదు. ఈతంతు కొన్ని రోజులుగా ఇలాంటి ఘటనలు బయటపడుతున్నా.. అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం వల్లే ఇలా జరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారిపట్ల అధికారులు కఠన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.
కాగా కొన్నిరోజులుగా నడుస్తున్న ఈ తంతుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. అధికారులు హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈక్రమంలో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన చికెన్ ను పట్టుకున్నారు. దీంతో ఏం తినాలో.. ఏం తినకూడదో అర్థం కాక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.