నాటుసారా, కల్తీ మద్యంపై ఉక్కుపాదం

మద్యపాన నిషేధంలో ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. బార్ల సంఖ్య 40 శాతం తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణస్వామి తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 10:28 AM IST
నాటుసారా, కల్తీ మద్యంపై ఉక్కుపాదం

Updated On : November 19, 2019 / 10:28 AM IST

మద్యపాన నిషేధంలో ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. బార్ల సంఖ్య 40 శాతం తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణస్వామి తెలిపారు.

మద్యపాన నిషేధంలో ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. బార్ల సంఖ్య 40 శాతం తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణస్వామి తెలిపారు. త్వరలో లైసెన్స్ ఫీజులు పెంచుతామని చెప్పారు. మంగళవారం (నవంబర్ 19, 2019) అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నాటుసారా, కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. దశలవారీ మద్యపాన నిషేధానికి అందరూ సహకరించాలని కోరారు.

ప్రస్తుతం ఉన్నబార్లు తీసేసి కొత్తగా లైసెన్స్ లు ఇస్తామని చెప్పారు. బార్లలో మద్యం సరఫరా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. బార్డర్ ఏరియాలో చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ ఫోర్స్ మెంట్ చాలా తీవ్రంగా పని చేయాలని చెబుతున్నట్లు వెల్లడించారు. అక్రమంగా మద్యం తరలిస్తే నిర్భయంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

టీడీపీపై మంత్రి ఫైర్ అయ్యారు. లోకేష్, చంద్రబాబు, ఆ పార్టీ నాయకుల ఉద్దేశం తనకు అర్థం కావడం లేదన్నారు. దశలవారీగా మద్య పాన నిషేదం కార్యక్రమానికి సహకరిస్తున్నారా లేదా మద్య పానం తీసివేయాలని ధర్నాలు చేస్తున్నారో చెప్పాలని టీడీపీ నేతలను ప్రశ్నించారు.