8వ తరగతికే అద్భుతం : కుర్రాడి యంత్రాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం
కరీంనగర్: ధాన్యం నింపేందుకు తన తల్లి పడుతున్న కష్టం చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే ఏదైనా యంత్రం కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన నుంచి అద్భుతమైన

కరీంనగర్: ధాన్యం నింపేందుకు తన తల్లి పడుతున్న కష్టం చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే ఏదైనా యంత్రం కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన నుంచి అద్భుతమైన
కరీంనగర్: ధాన్యం నింపేందుకు తన తల్లి పడుతున్న కష్టం చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే ఏదైనా యంత్రం కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన నుంచి అద్భుతమైన యంత్రాన్ని ఆవిష్కరించాడు. అదే ధాన్యం నింపే యంత్రం (ప్యాడీ ఫిల్లింగ్ మిషన్). ఇది కనిపెట్టింది ఏ ఇంజినీరింగ్ విద్యార్దో, ఐఐటీ విద్యార్థో కాదు.. జస్ట్ 8వ తరగతి స్టూడెంట్. అభిషేక్ రూపొందించిన ధాన్యం నింపే యంత్రం (ప్యాడీ ఫిల్లింగ్ మిషన్) ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం దృష్టిలో పడింది. ఈ యంత్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. దానికి ‘వరి-అభిషేక్’ పేరు కూడా పెట్టి పేటెంట్ తీసుకోవాలని నిర్ణయించింది. త్రానికి పేటెంట్ హక్కులను పొందేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అధికారులను ఆదేశించారు. యాసంగి సీజన్ నుంచి కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ఈ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.
అభిషేక్… రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. ఇటీవలే అతడు ధాన్యం నింపే యంత్రాన్ని కనిపెట్టాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్లలో దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఢిల్లీలో ఫిబ్రవరి 14, 15 తేదీల్లో జరిగిన జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్‌లోనూ మూడో బహుమతి దక్కింది. దీంతో అభిషేక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అభిషేక్ ధాన్యం నింపే యంత్రం గురించి తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఆరా తీసింది.
శనివారం(ఫిబ్రవరి 23) అభిషేక్ తన తల్లిదండ్రులతో కలిసి పౌరసరఫరాల భవన్‌లో కమిషనర్ అకున్ సబర్వాల్‌ను కలిశారు. యంత్రం పనితీరును వారికి వివరించాడు. అభిషేక్‌ను అభినందించిన కమిషనర్ అతడికి రూ.10 వేల నగదు, రోబో బొమ్మను బహుకరించాడు. మంచి ఫ్యూచర్ ఉందని ప్రశంసించారు. యంత్రానికి సంబంధించి కొన్ని మార్పులను సూచించారు. అభిషేక్ తయారు చేసిన యంత్రం చిన్నదిగా ఉందని, హమాలీలకు సరిపోయే విధంగా యంత్రం ఎత్తును పెంచాలని, ప్రస్తుతం యంత్రం 20 కేజీల బరువును మాత్రమే తూకం చేసే విధంగా ఉందని, దీన్ని 40-45 కిలోల బస్తా బరువు మోసే విధంగా వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ అన్నారు.
ఈ మార్పులు చేసిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో ప్రవేశపెడతామన్నారు. యంత్రం భద్రత విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నలుగురు చేసే పనిని ఈ యంత్రంతో ఒక్కరే చేయవచ్చని, అదే సమయంలో దాని బరువును కూడా కొలవచ్చని అన్నారు. బస్తా నిండిన తర్వాత ఎక్కడ నిల్వ చేయాలో అక్కడి వరకు ఈ యంత్రంతోనే తరలించ వచ్చని చెప్పారు. రైతులకు సమయం, డబ్బు ఆదా చేయడమే కాకుండా శ్రమకూడా తగ్గుతుందన్నారు. ఈ యంత్రాన్ని రైతులు వారి పొలంలో, ఇళ్ల వద్ద ఐకేపీ కేంద్రాల్లో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.