మోడీ ఎత్తుకెళ్లాడు.. చంద్రబాబు దొరకలేదు

  • Published By: vamsi ,Published On : April 7, 2019 / 05:59 AM IST
మోడీ ఎత్తుకెళ్లాడు.. చంద్రబాబు దొరకలేదు

Updated On : April 7, 2019 / 5:59 AM IST

ఆంద్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచుతున్నాయి. నిజం తెలుసుకోవడం కోసం మరావతి, పోలవరం ప్రాజెక్టులతో పాటు… ఏపీకి పరిశ్రమలు వచ్చాయా? లేదా? అనే విషయమై అన్నీ ప్రాజెక్టుల వద్దకు, పరిశ్రమల వద్దకు వెళ్లానని, టీడీపీ ప్రభుత్వం చెప్పినట్లుగానే అనేక పరిశ్రమలు స్థాపించిందని శివాజీ అన్నారు. దాదాపు రెండు లక్షలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మాట వాస్తవమని శివాజీ చెప్పారు.

ఏపీకి రావాల్సిన అనేక కంపెనీలను మోడీ ఉత్తరాదికి తరలించుకున్న మాట కూడా వాస్తవమని శివాజీ అన్నారు. చంద్రబాబు ఎక్కడైనా తప్పు చేశారేమో.. దొరుకుతారేమో అని చాలా ప్రయత్నించానని కానీ ఎక్కడ కూడా తనకు అుటవంటి అవకాశం దొరకలేదని అన్నారు. అలాగే జగన్‌కు సొంత విజన్ లేదని, అధికారంలోకి వస్తే ఏం చేయాలనే దానిపైన ఆయనకే స్పష్టమైన క్లారిటీ లేదని శివాజీ అన్నారు.

అలాగే పవన్, జగన్, చంద్రబాబు బ్యాచ్‌లుగా విడిపోయి జనం చంపుకునేందుకు కూడా సిద్ధం అవుతున్నారని, కాపు, కమ్మ, రెడ్డిలుగా విడిపోయి గొడవలకు దిగుతున్నారని అన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే నటులెవరూ మాట్లాడలేదని, ఇప్పుడు వచ్చి ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతున్నారని మండిపడ్డారు. మోహన్‌బాబు, జీవిత, రాజశేఖర్‌, అలీ వీళ్లంతా ఒక పార్టీని గెలిపించాలని కోరుతున్నారని విమర్శించారు. హక్కులు గుర్తొచ్చినప్పుడు.. బాధ్యతలు గుర్తుకు రావా?అని నిలదీశారు. ఒక్క హీరో రామ్‌ తప్ప ఎవరూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని సినీ నటులను విమర్శించారు.