పేరెంట్స్‌ను మర్డర్ చేశారని తాలిబాన్లను చంపేసిన బాలిక

తల్లిదండ్రులను మర్డర్ చేశారనే కోపంతో అఫ్గన్ అమ్మాయి ఇద్దరు తాలిబాన్లను చంపేయడంతో పాటు పలువురిని గాయాలకు గురి చేసింది. ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారనే నెపంతో అమ్మాయి పేరెంట్స్ ను మర్డర్ చేశారు. ఘోర్ ప్రాంతంలో ఖమర్ గల్ ఇంటిని టెర్రరిస్టులు చుట్టుముట్టి ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఆమె తండ్రి కోసం వారు వెదుకుతున్నారని గ్రామ పెద్ద హబీబురామన్ మలేక్జాడ అన్నారు. ఆమె తండ్రి ప్రభుత్వానికి మద్ధతుదారుడిగా ఉన్నాడు. అందుకే తాలిబాన్ టెర్రరిస్టులు ఇంట్లోకి వెళ్లి అతనిని లాక్కొని వచ్చారు. అడ్డుకోవడానికి వెళ్లిన భార్యతో సహా మర్డర్ చేశారని ఆయన చెప్పారు.
‘ఇంట్లో ఉన్న ఖమర్ గల్ AK-47తుపాకీ తీసుకుని బయటికొచ్చింది. పేరెంట్స్ ను చంపిన ఇద్దరు ఫైటర్లను కాల్చేసింది. తర్వాత కొందరిని గాయపరిచింది. బాలిక వయస్సు కేవలం 14నుంచి 16ఏళ్ల మధ్యలో ఉండొచ్చు. ఈ వయస్సులోనే పోరాడటం తెలుసుకోవడమనేది అఫ్గన్లలో కామన్. చాలా మంది తాలిబాన్ టెర్రరిస్టులు ఇంటిపై దాడి చేయడానికి వచ్చారు. అప్పటికే కొందరు గ్రామస్థులు వచ్చి గన్ ఫైట్ తర్వాత చెల్లాచెదురుచేశారు.
అఫ్ఘన్ సెక్యూరిటీ ఫోర్సెస్ గల్ ను తీసుకుని వెళ్లారు. ఆమె తమ్ముడిని కూడా భద్రమైన ప్రదేశానికి తీసుకెళ్లారని మొహమ్మద్ ఆరిఫ్ ఆబెర్ అన్నారు. ఘటన గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతోనే వైరల్ అయింది. కామెంట్లు వరదలా వస్తున్నాయి. ఆ ఫొటోగ్రాఫ్ లో గల్ హెడ్‌స్కార్ఫ్ కట్టుకుని చేతిలో మెషిన్ గన్ పట్టుకుని ఉంది.