పైసా ఖర్చు లేకుండా..ఆరోగ్య కేంద్రంలోనే అన్ని వైద్యాలు : మంత్రి ఈటల

ఆరోగ్యం తెలంగాణ లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్యం కేంద్రంలోనే అన్ని రకాల ఆరోగ్య సేవల్ని త్వరలోనే అందించనున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో గంగధర పీహెచ్ సీని మంత్రి ఈటల సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా అన్ని వైద్యసేవలు అందిస్తున్నామని అన్నారు.
గ్రామీణ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవల్ని అందిస్తున్నామనీ..ఆరోగ్య కేంద్రాలను మూడు రకాలుగా విభజించి అదనంగా సిబ్బందిని నియమించి ప్రజలు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ సేవల్ని మరింతగా మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామనీ..దీంట్లో భాగంగానే..త్వరలో ఆరోగ్య కేంద్రంలోనే అన్ని రకాల వైద్యసేవల్ని అందిస్తామని ఆరోగ్యశాఖా మంత్రి ఈటల తెలిపారు.