జనసేనకు అల్లు అర్జున్ మద్దతు : పవన్ పరామర్శకు రేపు అమరావతి

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం అమరావతికి వెళుతున్నారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పరమార్శించనున్నారు. ఈ సందర్భంగా జనసేనకు మద్దతు తెలియచేయనున్నారు. నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబుకు కూడా మద్దతు ప్రకటించనున్నారు. ఇటీవలే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్‌కు వడదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకున్న అనంతరం ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా కుటుంబంలోని ఒక్కొక్కరు ఆయన్ను పరామర్శించి మద్దతు తెలియచేస్తున్నారు.
జనసేనకు మద్దతుగా ఇప్పటికే వరుణ్ తేజ, నిహారిక, మరికొందరు ప్రచారం చేస్తున్నారు. జనసేనకు మద్దతు తెలియచేస్తున్నట్లు అల్లు అర్జున్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘మేం మీతో ఉన్నాం అని ట్వీట్ చేశారు బన్నీ. మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా, ప్రోత్సహిస్తున్నా.. మేమంతా మీతో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని నిర్ణయం తీసుకున్న నాగబాబు గారికి హృదయ పూర్వక అభినందలని బన్నీ తెలిపారు. కొద్దిసేపటికే నంద్యాల నుండి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి శిల్పారవి చంద్రా రెడ్డికి బన్నీ మద్దతు ప్రకటించడం మెగా అభిమానుల్లో కలకలం రేపింది. తాజాగా బన్నీ..పవన్‌కు మద్దతు తెలియచేస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.