అమ్మఒడి పథకం : డిసెంబర్ 24లోగా లబ్దిదారుల ఎంపిక
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ''అమ్మఒడి''. 2020 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద విద్యా సాయం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున

జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ”అమ్మఒడి”. 2020 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద విద్యా సాయం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ”అమ్మఒడి”. 2020 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద విద్యా సాయం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది. 1 వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు (కుటుంబంలో ఒకరికి మాత్రమే) ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు లబ్దిదారుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. డిసెంబర్ 24వ తేదీలోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనుంది.
అమ్మఒడి పథకం అర్హుల ముసాయిదా జాబితాను గ్రామ సచివాలయాల్లో డిసెంబర్ 9న ప్రకటించాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అమ్మఒడి కార్యక్రమం విధివిధానాలపై రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో శనివారం(నవంబర్ 16,2019) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి రాజశేఖర్. గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లులు, సంరక్షకుల ఆధార్‌కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలని ఆదేశించారు.
విద్యార్థులు పాఠశాల పున: ప్రారంభం లేదా చేరినప్పటి నుంచి 75శాతం హాజరు ఉండాలని తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఆధార్ నంబర్, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ లేని విద్యార్థుల వివరాలను గ్రామ వాలంటీర్ల ద్వారా నవంబర్ 25 నుండి డిసెంబర్ 1 వరకు సేకరించి హెచ్‌ఎంకు అందజేయాలన్నారు. పర్యవేక్షణకు, సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేలా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక అధికారిగా పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ గా సుబ్బారెడ్డిని నియమించారు.
ముఖ్యమైన తేదీలు:
* పాఠశాల ఛైల్డ్ ఇన్ఫోలో పొందుపరిచిన విద్యార్థుల వివరాలను హెచ్‌ఎం నవంబర్ 17 నుంచి 19 వరకు పరిశీలించి ధృవీకరించాలి.
* ఎపిసిఎఫ్‌ఎస్‌ఎస్ నవంబర్ 21న హెచ్‌ఎంలకు అందిన సమాచారంలో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దాలి.
* ఆ జాబితాను సంబంధిత గ్రామ సచివాలయంలోని విద్య, సంక్షేమ సహాయకుని లాగిన్‌కు 24లోపు పంపాలి.
* గ్రామ సచివాలయాల్లోని విద్య, సంక్షేమ సహాయకుడు హెచ్‌ఎం అందించిన సమాచారాన్ని గ్రామ సచివాలయం నోటీస్ బోర్డులో నవంబర్ 25న ప్రకటించాలి.
* దీనిపై అభ్యంతరాలు ఉంటే మూడు రోజుల్లో గ్రామ సచివాలయ విద్య, సంక్షేమ సహాయకునికి తెలపాలి.
* ఆధార్ నెంబర్, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ లేని విద్యార్థుల వివరాలను గ్రామ వాలంటీర్ల ద్వారా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు సేకరించి హెచ్‌ఎంలకు నేరుగా అందించాలి.
* ఈ సమాచారాన్ని ఎపిసిఎఫ్‌ఎస్‌ఎస్ పోర్టల్‌లో డిసెంబర్ 5 నాటికి హెచ్‌ఎం అప్‌డేట్ చేయాలి.
* ఆన్‌లైన్‌లో అందిన సమాచారం, అప్‌డేట్ ప్రకారం అర్హులైన తల్లుల, సంరక్షకుల ముసాయిదా జాబితాను డిసెంబర్ 8 నాటికి సచివాలయ విద్య, సంక్షేమ సహాయకుని లాగిన్‌కు హెచ్‌ఎం పంపించాలి.
* ఈ జాబితాను గ్రామ స్థాయిలో డిసెంబర్ 9న ప్రకటించాలి.
* డిసెంబర్ 13 వరకు ఈ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు.
* ముసాయిదా జాబితాను డిసెంబర్ 15 నుంచి 18లోపు గ్రామసభ ఆమోదం పొంది, హెచ్‌ఎంకు డిసెంబర్ 20 నాటికి అందజేయాలి.
* మండల విద్యాశాఖ అధికారికి హెచ్‌ఎం డిసెంబర్ 23లోగా అందజేయాల్సి ఉంటుంది.
* జిల్లా విద్యాశాఖ అధికారి డిసెంబర్ 24 నాటికి జిల్లా కలెక్టర్ల ఆమోదానికి సమర్పించాలి.