పాలకులే పెయిడ్ ఆర్టిస్టులు : అమరావతి రైతులు

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 06:06 AM IST
పాలకులే పెయిడ్ ఆర్టిస్టులు  : అమరావతి రైతులు

Updated On : January 2, 2020 / 6:06 AM IST

మా దగ్గరకు వచ్చి..మమ్మల్ని ఓట్లు అడిగి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన  పాలకులే పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అమరావతి ప్రాంత రైతులు సీఎం జగన్, మంత్రులు..ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చి ఇప్పుడు రోడ్లపాలైన తాము నిరసలు చేసే రైతుల్ని పట్టుకుని పెయిడ్ ఆర్టిస్టులు..జూనియర్ ఆర్టిస్టులు అంటారా? ఇదేనా రాష్ట్రాన్ని పాలించే పాలకుల విజ్నత..విచక్షణ..అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 

అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం రాజకీయాలు ఎలా మాట్లాడుతారు? ఒక స్పీకర్ గా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అంటూ రైతులు ప్రశ్నించారు. రైతుల ఉద్యమాన్ని అవహేళన చేస్తు మాట్లాడటం ఆయన విజ్నత ఎలా ఉందో తెలుస్తోందన్నారు. మా ఉద్యమాన్ని చులకన చేసి మాట్లాడితే సహించేది లేదని నేతలు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు. అమరావతి రాజధానిగా కొనసాగాలనే మా డిమాండ్ తప్ప రాజధానికి ఇచ్చిన భూముల్ని తిరిగి తీసుకోవటం కాదని రైతులు స్పష్టంచేశారు.   

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలడపూడిలో రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రోడ్లు పక్కన టెంట్లు వేసిన రైతులు దీక్షలను కొనసాగిస్తున్నారు. సీఎం జగన్ మూడు రాజధానులు అంటూ ప్రతిపాదించటం..జీఎన్ రావు కమిటీ దానికి అనుకూలంగా నివేదిక ఇవ్వటం వంటి పరిణామాలతో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు..రైతుల కుటుంబాల్లోని మహిళలతో పాటు రోడ్డు ఎక్కారు. మూడు రాజధానులు వద్దు..అమరావతి ఒక్కటే ముద్దు అంటూ నినదిస్తున్నారు. తమకు అన్యాయం చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రైతుల నిరసనలపై అధికార పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో రైతులు మండి పడుతున్నారు. మా ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి మాకు అన్యాయంచేస్తుంటే ప్రశ్నిస్తున్న తమను పెయిడ్ ఆర్టిస్టులను అవహేళన చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు.