మాజీ ఎంపీ హర్షకుమార్‌పై మరో కేసు నమోదు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పై మరో కేసు నమోదైంది. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహం వివాదంలో అనపర్తి డీఎస్పీ హర్షకుమార్ పై పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేశారు. దీంతో కోర్టు హర్షకుమార్ కు జనవరి 6 వరకు రిమాండ్ విధించింది. కాగా కోర్టు స్థలం వివాదంలో హర్షకుమార్ ఇప్పటికే రిమాండ్ లో ఉండగా అది డిసెంబర్ 26తో రిమాండ్ ముగియనుంది. ఈ క్రమంలో మరోకేసు విషయంలో ఆయనకు నమోదు కావటంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అమలాపురం కోర్టు ఆవరణలో ఉన్న పాన్‌షాప్ ను కూల్చివేసే సమయంలో హర్షకుమార్ అడ్డుకొన్నారు.ఈ సమయంలో జ్యుడిషియల్ సిబ్బందితో పాటు అక్కడే ఉన్న మహిళలపై దురుసుగా హర్షకుమార్ ప్రవర్తించాడని ఆయనపై 353, 354, 323, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసులు ఉన్న విషయం తెలిసిందే. చిన్న కేసులో తనకు అరెస్ట్ వారంట్ జారీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేసారు. సీఎం జగన్ తనపై కక్షసాధించే చర్యలు చేస్తున్నారనీ హర్షకుమార్ కోర్టు స్థలం కేసు విషయంలో విమర్శించిన విషయం తెలిసిందే.