ఏపీ బడ్జెట్ అసెంబ్లీ : హామీలు నెరవేర్చని కేంద్రం – గవర్నర్

విజయవాడ : ఏపీ బడ్జెట్ సమావేశాలు జనవరి 30వ తేదీన స్టార్ట్ అయ్యాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. ఏపీకి ఇస్తామన్న హోదా కేంద్రం ఇవ్వలేదని..కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఏన్టీఆర్ చెప్పినట్లు సమాజమే దేవాలయమన్న గవర్నర్…రాష్ట విభజన అసంబద్ధంగా జరిగిందన్నారు. కేంద్ర మద్దతు లేకున్నా ఏపీ అభివృద్ధిలో దూసుకపోతోందన్నారు. నాలుగున్నరేళ్లలో విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. విభజన వల్ల ఏపీ రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. మౌలిక, సేవా రంగాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతోందన్నారు.