బాబుకు రిటర్న్ గిఫ్ట్ పక్కా – తలసాని…

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ పక్కా ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. ఎన్నికల సమయంలో తామిచ్చే గిఫ్ట్ మజా వేరేగా ఉంటుందని..కానీ ఎలాంటి గిఫ్ట్ ఉండబోతోందో ముందు ముందు చూడాలని మరింత సస్పెన్ష్‌లో పెట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తలసాని..ఇతరులు భీమవరం వెళ్లారు. మార్గమధ్యలో ఉన్న ఇంద్రకీలాద్రిని తలసాని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తలసానితో టెన్ టివి ముచ్చటించింది. టీడీపీ ప్రభుత్వంపై తలసాని కీలక కామెంట్స్ చేశారు.
బాబును ప్రజలు నమ్మరని…ఇక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. జాబు రావాలంటే..బాబు రావాలని అన్నారని..చెప్పిన పని చేశారా అని నిలదీశారు. యాదావుల బలం ఎలా ఉండబోతోందో చూడాలని తెలిపారు. ఉద్యోగాలు, అభివృద్ధిని ఇక్కడి వారు కోరుకుంటే బాబు మాత్రం సినిమా చూపిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని పేర్కొన్న తలసాని ప్రత్యేక హోదాపై టీడీపీ భిన్న వ్యాఖ్యలు చేసిందని విమర్శించారు.