సంక్రాంతిలో కోడి పందాల సందళ్లు..పోలీసులు దాడులు

  • Published By: veegamteam ,Published On : January 10, 2019 / 05:13 AM IST
సంక్రాంతిలో కోడి పందాల సందళ్లు..పోలీసులు దాడులు

Updated On : January 10, 2019 / 5:13 AM IST

పశ్చిమగోదావరి : ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలలో ముందుగా గుర్తుకొచ్చేది కోడి పందాలు. జనవరి నెలలో వచ్చే ఈ సంక్రాంతి లేక సంక్రమణం అంటే మారటం అని అర్థం. సూర్యుడు మేష రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశంచిన రోజు నుండి సంక్రాంతి మాసం ప్రారంభాన్ని నెల పట్టటం అంటారు. ఆ నాటి నుండి కోడి పందాల సందళ్లు పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలో మొదలైపోయాయి. ఊర్ల నుండి వెళ్లి వేరే వేరే ప్రాంతాలలో స్థిరపడ్డవారు సంక్రాంతి పండుగకు తప్పనిసరిగా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో ఊళ్లలో సంక్రాంతి సందడి మొదలైపోయింది. జనం వుంటేనే కదా సందడి..ప్రజల సందడితో పాటు కోడి పందాలు కూడా మొదలైపోయాయి. 

ఇదే సమయంలో కోడి పందాల సందడి చేస్తుంటే మరోవైపు వాటిని అడ్డుకునేందుకు పోలీసుల సందడి కూడా మొదలైంది. ఈ కోడి పందాలను అడ్డుకోవాలని..కోర్టుకు కూడా వెళ్లారు. కానీఇది సంక్రాంతి సంప్రదాయం కాబట్టి ఆడి తీరతామని అంటున్నారు మరికొంది. దీనిపై పోలీసులు నిఘా పెట్టినా కోడి పందాలు మాత్రం ఆగటం లేదు. దీంతో పోలీసులు మాత్రం చేసేమనే పేరుకు కోడి పందాలనుఅడ్డుకునేందుకు యత్నించటం జరగుతోంది. 

ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం సమీపంలోని రంగంపేట వద్ద పామాయిల్ తోటల్లో పందాలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి పందెం కోళ్లను..పందెం కాస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలకు అనుమతి లేదని, పందాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు అంటుంటే..పట్టుబడినా సరే పందాలు వేసి తీరతామని ఉభయ గోదావరి జిల్లా వారు అంటున్నారు. ఈ క్రమంలో ఈ కోళ్ల పందాలలో రాజకీయ నాయకులతో పాటు ప్రముఖ సినీ నటులు కూడా పాల్గొంటుంటారు. దీంతో ఈ కోడి పందాలు  మరింత జోష్ గా కొనసాగుతున్నాయి.