సత్తా ఏంటో చూపిస్తానంటున్న పవన్

  • Published By: madhu ,Published On : March 21, 2019 / 09:42 AM IST
సత్తా ఏంటో చూపిస్తానంటున్న పవన్

Updated On : March 21, 2019 / 9:42 AM IST

రాజకీయం తెలియదంటారా ? జనసేనా సత్తా ఏంటో చూపిస్తానని ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తమది మార్పు కోసమే పోరాటమన్నారు. జనసేనలో పట్టుమని 10 మంది నాయకులు లేరని ఆనాడు నేతలు విమర్శించారన్నారు. ఈ పార్టీలో నిలబడాలంటే ధైర్యవంతులే కావాలన్నారు పవన్. 2019 ఎన్నికల్లో తనకు అండగా నిలబడండి..జీవితాంతం అండగా ఉంటానని పవన్ ప్రజలకు హామీనిచ్చారు. పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మార్చి 21, 2019 గురువారం విశాఖ నగరపాలక సంస్థ జోన్‌-5 కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి పవన్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. 
Read Also : జగన్‌కి ఒక్క ఛాన్స్ ఇస్తే : ప్రశాంతంగా బతకలేరు

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో పవన్ మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను గుర్తించాల్సినవసరం లేదని..అయితే హోదా ఇవ్వాలన్నారు. ముందు నుండి పోరాటం చేస్తున్న వామపక్షాలకు ఒక అండ కావాలన్నారు. చంద్రబాబు, జగన్‌కు మోడీ అంటే భయమని..కానీ తనకు భయం లేదన్నారు. టీడీపీ, వైసీపీ నాయకులు..మంచి వాళ్లను నిలబెడితే తాను కూడా మంచివాళ్లను నిలబడుతామని..అలాకాకుంటే రౌడీలను నిలబెడితే..వారి తాట తీసే నేతలను నిలుపుతానన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే కొండలు..గుట్టలు కబ్జాలు చేస్తారని, జనసేన అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఏపీ ప్రజలను పవన్ కోరారు. 
Read Also : చిత్తుకాగితాలు కాదురా అవి : పాకిస్తాన్ ప్రింటింగ్ ప్రెస్ ల్లో భారత నోట్ల ముద్రణ