బిగ్ న్యూస్ : పరిపాలన రాజధానిగా భీమిలి

పరిపాలన రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి పరిపాలన రాజధాని అవుతుందన్నారు. భీమిలి నియోజకవర్గంలో పరిపాలన

  • Published By: veegamteam ,Published On : December 21, 2019 / 02:13 PM IST
బిగ్ న్యూస్ : పరిపాలన రాజధానిగా భీమిలి

Updated On : December 21, 2019 / 2:13 PM IST

పరిపాలన రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి పరిపాలన రాజధాని అవుతుందన్నారు. భీమిలి నియోజకవర్గంలో పరిపాలన

ఏపీ పరిపాలన రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి పరిపాలన రాజధాని అవుతుందన్నారు. భీమిలి నియోజకవర్గంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సంకల్పించారని విజయసాయి రెడ్డి చెప్పారు. కాపులుప్పాడులో పరిపాలన రాజధాని నిర్మించే అవకాశం ఉందన్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుతో భీమిలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని విజయసాయి రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. శనివారం(డిసెంబర్ 21,2019) విశాఖలో ఓ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం ఆశయం అన్నారు. కాగా, అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏ ఒక్క రైతూ నష్టపోరని విజయసాయి రెడ్డి హామీ ఇచ్చారు.

ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు కావొచ్చు అని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందని సీఎం జగన్ చెప్పారు. ఆ తర్వాత రాజధానిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ సైతం.. తన నివేదికలో ఇలాంటి సిఫార్సులే చేసింది. మూడు రాజధానుల వైపు జీఎన్ రావు కమిటీ మొగ్గు చూపింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని నివేదికలో పేర్కొంది.

reddy

కాగా, విశాఖ పరిపాలన రాజధాని కావొచ్చు అని సీఎం జగన్ ప్రకటించాక… విశాఖలో ఏ ప్రాంతంలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీని గురించి డిస్కషన్ జరుగుతోంది. ఇంతలో.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ భీమిలి అంటూ విజయసాయి రెడ్డి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయసాయి రెడ్డి వైసీపీలో కీలక నేత. సీఎం జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. దీంతో ఆయన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

విజయసాయి రెడ్డి కామెంట్స్: 
* రెండో రాజధాని భీమిలి
* పరిపాలన రాజధానిగా భీమిలి
* రాజధాని ఏర్పాటుతో భీమిలి నియోజకవర్గం బాగుపడుతుంది
* ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకే ఇక్కడ రాజధాని ఏర్పాటు
* సీఎం, మంత్రులు, యంత్రాంగం ఇక్కడి నుంచే పనిచేస్తుంది
* కాపులుప్పాడులో పరిపాలన రాజధాని నిర్మించే అవకాశం

Also Read : పవన్ కు మరో షాక్ : మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు