అధికారులు లంచాలు తీసుకోకుండా ప్రభుత్వ కొత్త విధానం

విద్యుత్‌ అధికారులు లంచాలు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్‌ కార్యాలయాల్లో అవినీతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్‌ ఫొటో ఉన్న బాక్స్‌ను ఏర్పాటు చేశారు.

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 03:43 AM IST
అధికారులు లంచాలు తీసుకోకుండా ప్రభుత్వ కొత్త విధానం

Updated On : December 28, 2019 / 3:43 AM IST

విద్యుత్‌ అధికారులు లంచాలు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్‌ కార్యాలయాల్లో అవినీతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్‌ ఫొటో ఉన్న బాక్స్‌ను ఏర్పాటు చేశారు.

విద్యుత్‌ అధికారులు లంచాలు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్‌ కార్యాలయాల్లో అవినీతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్‌ ఫొటో ఉన్న బాక్స్‌ను ఏర్పాటు చేశారు. అధికారుల వల్ల వినియోగదారులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే దానికి సంబంధించిన వివరాలను రాత పూర్వకంగా ఆ బాక్స్‌లో వేసేలా ఏర్పాట్లు చేశారు.
 
దీంతో పాటు తమ పరిధిలోని విద్యుత్‌ కేంద్రాల్లో ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్‌ అధికారులు లంచాలు తీసుకోకుండా వినియోగదారుల ఫిర్యాదు కేంద్రాలను మొదటగా శ్రీకాకుళం జిల్లా విద్యుత్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. స్పందించిన జిల్లా విద్యుత్‌ అధికారులు తమ కార్యాలయ అధికారులు లంచాలు తీసుకోకుండా చర్యలు తీసుకున్నారు. 

జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ ప్రాంతంలోని ఎస్‌ఈ కార్యాలయం నుంచి ఏఈ కార్యాలయం వరకు వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించేలా ఏర్పాటు చేశారు.  దీంతో క్షేత్ర స్థాయిలో లంచాలకు చెక్‌ పడుతోందనే అశాభావం వ్యక్తం చేస్తున్నారు.