కావాలనే చేశారా:తిరుపతిలో చెట్లకు శిలువ గుర్తుల కలకలం

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 07:09 AM IST
కావాలనే చేశారా:తిరుపతిలో చెట్లకు శిలువ గుర్తుల కలకలం

Updated On : January 2, 2020 / 7:09 AM IST

శ్రీవారి సన్నిథిలో సిలువ గుర్తుల కలకలం సృష్టిస్తున్నాయి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో ఉన్న చెట్లకు ఏసుక్రీస్తు శిలువ గుర్తులు కలకలం సృష్టిస్తున్నాయి. చెట్లకు వేసి ఉన్న శిలువ గుర్తులను గమనించిన హాస్పిటల్ సిబ్బంది వాటిని చెరిపివేశారు. కానీ ఈ విషయం బైటకువచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు రంగంలోకి దిగారు. స్విమ్స్ హాస్పిటల్ కు చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ఎవరో కావాలని చెట్లకు శిలువ గుర్తులను వేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

తిరుపతిలో అన్యమత ప్రచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో తిరుపతి స్విమ్‌ ఆవరణలో అన్యమత చిహ్నాలు కనిపించాయి. గత కొంతకాలంగా టిటిడిలో అన్యమత ప్రచారం జరుగుతోందన్న విమర్శలు వస్తున్న క్రమంలో మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. స్విమ్స్ హాస్పిటల్ జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే స్విమ్స్‌ ఆస్పత్రిలోని ఆవరణలో ఉన్న 4, 5 చెట్లపై శిలువ గుర్తులు కలకలం రేపాయి. గురువారం తెల్లారేసరికి ఆస్పత్రి ప్రాంగణంలోని చెట్లపై శిలువ గుర్తులు ప్రత్యక్షమయ్యాయి. ఆ శిలువ గుర్తులను చూసిన రోగులు ఆస్పత్రి వర్గాలకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్విమ్‌ సిబ్బంది ఆ గుర్తులను తొలగించే ప్రయత్నాలు చేపట్టారు. గుర్తులున్న చెట్ల బెరడును చెక్కేశారు.

భద్రతా సిబ్బంది నిర్లక్ష్యమంటూ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. పోలీసులు ఎలర్ట్‌ అయ్యారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు కూడా ఎలర్ట్‌ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. ఎవరైనా కావాలనే ఇలా చేశారా.. అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.