అరకులో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
విశాఖ జిల్లాలో ప్రకృతి సౌందర్యానికి మారుపేరైన అరకు లోయలో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. సంక్రాంతి సమయంలో అంతటా గాలిపటాల జోరుంటే...అరకులోయలో మాత్రం అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫెస్టివల్ సరికొత్త అందాల్ని తీసుకొచ్చింది.

విశాఖ జిల్లాలో ప్రకృతి సౌందర్యానికి మారుపేరైన అరకు లోయలో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. సంక్రాంతి సమయంలో అంతటా గాలిపటాల జోరుంటే…అరకులోయలో మాత్రం అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫెస్టివల్ సరికొత్త అందాల్ని తీసుకొచ్చింది.
విశాఖ జిల్లాలో ప్రకృతి సౌందర్యానికి మారుపేరైన అరకు లోయలో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. సంక్రాంతి సమయంలో అంతటా గాలిపటాల జోరుంటే…అరకులోయలో మాత్రం అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫెస్టివల్ సరికొత్త అందాల్ని తీసుకొచ్చింది. బెలూన్లను ఎగురవేసేందుకు 13 దేశాల బృందాలు అరకు వచ్చాయి. జనవరీ 18 నుంచి 20 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. పర్యాటకంగా అరకులోయకు మరింత గుర్తింపు తెచ్చే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను నిర్వహిస్తోంది. చల్లని వాతావరణంలో గడిపేందుకు అరకు వస్తున్న పర్యాటకులకు ఈ హాట్ బెలూన్లు కనువిందు చేస్తాయి.
ఈ బెలూన్లు సముద్ర మట్టానికి 50వేల అడుగుల ఎత్తు వరకూ ఎగురుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. 2017లో జరిగిన హాట్ బెలూన్ ఫెస్టివలలో భారత్ తో పాటు థాయ్ లాండ్, టర్కీ, ప్రాన్స్, న్యూజిలాండ్ వంటి 13 దేశాలకు చెందిన 16 బెలూన్లు గాళ్లో చక్కెర్లు కొడుతూ పొటీ పడ్డాయి. ఈసారి మరింత గొప్పగా ఈ పండగను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఏర్పాట్లు చేస్తోంది.