సీమ సమస్యలు తీరాలంటే టీడీపీని గెలిపించండి : ఫరూక్ అబ్టుల్లా

కడప: ఎన్నికలకు ముందు రామమందిరం గురించి చర్చించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా. కేవలం పాకిస్తాన్ పై దాడి చేశామనే బీజేపీ చెప్పుకుంటూ దేశ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తీవ్ర వాదాన్ని, దేశ భద్రతను బీజేపీ రాజకీయం చేస్తోందని ఫరూక్ అబ్దుల్లా మండిపడ్డారు.
తాము ఉండేది పాకిస్తాన్ కి సరిహద్దు రాష్ట్రమని, పాకిస్తానేంటో, తీవ్రవాదమేంటో తమకు తెలుసున్ని ఆయన చెప్పారు. హిందూ, ముస్లిం, సిక్ , ఇసాయి అందరూ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. తెలుగు దేశం పార్టీ మద్దతుగా మంగళవారం కడపలో ప్రచారానికి వచ్చిన ఆయన రాయలసీమలో సాగునీటి సమస్య తీరాలంటే టీడీపీకి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు.