బోటు ప్రమాదం : భరించలేని దుర్వాసన, మీడియాకి నో ఎంట్రీ
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం ఘటనలో గాలింపు చర్యలు నిలిపివేశారు. గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం ఘటనలో గాలింపు చర్యలు నిలిపివేశారు. గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం ఘటనలో తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు చర్యలను తిరిగి ప్రారంభించారు. టూరిస్ట్ బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ఏడో రోజు గాలింపు చర్యలు చేపట్టారు. పైర్ సిబ్బంది గోదావరిని జల్లెడ పడుతున్నారు. దేవీపట్నం నుంచి కచ్చులూరు వరకు గాలిస్తున్నారు. కాగా, శుక్రవారం(సెప్టెంబర్ 20,2019) గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలను వెనక్కి పంపారు. దేవీపట్నం, కచ్చులూరులో అనధికార 144 సెక్షన్ విధించారు. మీడియాను ఎట్టి పరిస్థితుల్లో కచ్చులూరుకు వెళ్లనీయొద్దని స్థానిక సిబ్బందికి అధికారులు హుకుం జారీ చేశారు.
బోటు వెలికితీసేందుకు ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన సాంకేతిక బృందం, ముంబైకి చెందిన సాల్వేజ్ ప్రైవేటు సంస్థ నిపుణుడు బక్షి ఆపరేషన్లు విరమించుకున్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 20,219) ప్రమాద స్థలంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలను నిలిపివేశాయి. నేవీ, అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ బృందాలు వెనుదిరిగాయి. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న ఐటీడీఏ పీవో నిషాంత్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసరావు, ఉన్నతాధికారులంతా ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి వెళ్లిపోయారు.
బోటు ప్రమాదంలో ఇంకా 10 మృతదేహాలు దొరకలేదు. వాటి వెలికితీతకు కసరత్తు జరుగుతోంది. బోటు లోపల ఏసీ క్యాబిన్ లో మృతదేహాలు చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటు మునిగిన ప్రాంతంలో భరించలేని దుర్వాసన వస్తోందని అధికారులు తెలిపారు. గోదావరిలో మునిగిపోయిన బోటులో 77 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. తొలుత బోటులో 73మంది ఉన్నారని భావించినప్పటికీ.. బాధితుల సమాచారం ప్రకారం 77మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. ఇంకా 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. ఏపీకి చెందిన వారు 9మంది.. తెలంగాణకు చెందిన ఏడుగురు ఉన్నారని వెల్లడించారు. సెప్టెంబర్ 15న టూరిస్ట్ బోటు ప్రమాదం జరిగింది. కచ్చులూరు దగ్గర రాయల్ వశిష్ట బోటు మునిగిపోయింది. విహారం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.