ఆవు పేడలో పుట్టి పెరిగా..కరోనా నన్నేం చేస్తుంది?: మంత్రి గారి ధీమా

నేను ఆవుపేడలో పుట్టి పెరిగినదాన్ని.. నాకు కరోనాలు గిరోనాలు..ఎటువంటి మహమ్మారి అయినా సరే నా దగ్గరకు రాదు అంటూ ధీమా వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ మంత్రి ఇమర్తీ దేవి. తనకు కరోనా సోకిందంటూ వచ్చిందంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండిస్తూ…ఆమె ‘‘ఆవుపేడలో పుట్టి పెరిగా..నాకు కరోనా రావటమేంటి? అంటూ ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను ఆవుపేడలో పుట్టి పెరిగిన దాన్నని, అది తనను ఏమీ చేయలేదని ధీమా వ్యక్తం చేశారామె.
https://10tv.in/transgenders-beaten-by-young-man-tank-bund-at-ganesh-immersion/
వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ మంత్రి ఇమర్తి దేవికి కరోనా సోకిందంటూ స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఇది చూసిన మంత్రి అతడిపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు. ఇటువంటి అవాస్తవాలు రాసి ప్రజల్ని భయాందోళలనకు గురిచేస్తూ..తప్పదోవ పట్టిస్తున్నారని..మండిపడ్డారు. ఇలా అవాస్తవాలు రాయటం సరైందికాదనీ..ప్రజలకు వాస్తవాలు తెలిపే బాధ్యతలో ఉన్నవారు ఇటువంటి వార్తలు రాయటం మానుకోవాలని సూచించారు.
తాను ఆవు పేడలో పుట్టిపెరిగానని..ఇటువంటి కరోనా, గిరోనాలు ఎటువంటి మహమ్మారులు వచ్చినా తన వద్దకు రావనీ.. తనను ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
मैं गोबर में पैदा हुई हूं इतने कर्रे कीटाणु है कि #कोरोना नहीं आएगा – #मंत्री_इमरती_देवी
ठीक है मान ली आपकी बात ? #imartidevi #MadhyaPradesh #ShivrajSinghChauhan pic.twitter.com/AaK3ZcJ4pr— Kumar kundan ostwal (@OstwalKumarp) September 4, 2020