పెళ్లింట విషాదం : డెంగీతో పెళ్లికూతురు మృతి
డెంగీ మహమ్మారి పెళ్లి ఇంట విషాదం నింపింది. ఓ పెళ్లికూతురిని కబలించింది.

డెంగీ మహమ్మారి పెళ్లి ఇంట విషాదం నింపింది. ఓ పెళ్లికూతురిని కబలించింది.
డెంగీ మహమ్మారి పెళ్లి ఇంట విషాదం నింపింది. ఓ పెళ్లికూతురిని కబలించింది. చిత్తూరు జిల్లాలోని పాలసముద్రం మండలం కేఎన్ఆర్ పురానికి చెందిన కావ్య తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. జ్వరం కారణంగా చివరి నిమిషంలో పెళ్లి వాయిదా పడింది. జ్వరం మరింత ఎక్కువ కావడంతో తమిళనాడులోని వేలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పెళ్లి పీటలెక్కాల్సిన అమ్మాయి చనిపోవడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
చంద్రకళ అలియాస్ కావ్య డిగ్రీ చదువుతోంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడానికి సిద్ధ పడింది. (అక్టోబర్ 30, 2019)న మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. (అక్టోబర్ 29, 2019)న ఆమె డెంగీ బారిన పడింది. ఇంట్లో ఆమెకు నలుగు కార్యక్రమం కూడా నిర్వహించారు. అప్పుడు కూడా ఆమె జ్వరంతో బాధపడుతోంది. అయితే సమస్య తీవ్ర కావడం, ప్లేట్ లేట్లు పడిపోవడంతో అదే రోజున హుటాహుటిన ఆమె చికిత్స కోసం తమిళనాడు వేలూరులోని సీఎమ్ సీ ఆస్పత్రికి తరలించారు.
ఒకదశలో పెళ్లి చేసి ఆస్పత్రితో చేర్పిస్తే ఎలావుంటుందని పెద్దలు భావించారు. కానీ ఏమాత్రం తాళి కట్టించుకోవడానికి కూడా సిద్ధం లేనిస్థితిలో ఉండటంతో బంధువులు ఆస్పత్రికి తరించారు. ఆమెకు డెంగీ సోకిందని వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ శుక్రవారం (నవంబర్ 1, 2019) అర్ధరాత్రి ఆమె మృతి చెందింది. పెళ్లి ఇంట్లో పూర్తిగా విషాదం నిండిపోయింది.