బుద్ధా వెంకన్న ట్వీట్స్ : శకుని మామా నువ్వా..బాబు గురించి మాట్లాడేది

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ప్రధానంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత బుద్ధా వెంకన్న మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలతో విరుచకపడ్డారు. శకుని మామా అంటూ ట్వీట్ చేశారు. అక్టోబర్ 02వ తేదీ బుధవారం ఆయన ట్విట్టర్‌లో వరుస ట్వీట్లు చేశారు.
‘స్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే శకుని మామా నువ్వా చంద్రబాబు గారి గురించి మాట్లాడేది ? పెద్ద పెద్ద విషయాలు మాట్లాడే ముందు ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు. గోదావరిలో మీ ప్రభుత్వం ముంచేసిన బోట్‌లో ఎంత మంది ఉన్నారు? వరద ఉన్నప్పుడు బోట్ వెళ్లడానికి అనుమతి ఇచ్చిన మంత్రి ఎవరు’ ? అని ప్రశ్నించారు.
తర్వాత మరో ట్వీట్ చేశారు. ఇప్పటి వరకూ ఎంత మంది మృతదేహాలు వెలికితీశారు ? ఇంకా ఎంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది ? గోదావరిలో కూడా 144 సెక్షన్ పెట్టిన ఘనత మీ తుగ్లక్‌ది అంటూ ట్వీట్‌లో తెలిపారు. బోట్ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న వారికీ కనీసం మృతదేహాలను అందించలేని చేతగాని ప్రభుత్వం మీదంటూ విమర్శించారు.
Read More : కూష్మాండ అలంకారంలో బాసర సరస్వతి అమ్మవారు
‘బోట్ ప్రమాదంలో మీరు చంపేసిన వ్యక్తుల కుటుంబాలకు గతంలో మీరు డిమాండ్ చేసిన విధంగా రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఎప్పుడు ఇస్తున్నారు? ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే, మరి మీ జగన్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నాడు? సమాధానం చెప్పగలవా శకుని మామా!!’ అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
బోట్ ప్రమాదంలో మీరు చంపేసిన వ్యక్తుల కుటుంబాలకు గతంలో మీరు డిమాండ్ చేసిన విధంగా 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఎప్పుడు ఇస్తున్నారు? ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే, మరి మీ జగన్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నాడు? సమాధానం చెప్పగలవా శకుని మామా!!
— venkanna_budda (@BuddaVenkanna) October 2, 2019
ఇప్పటి వరకూ ఎంత మంది మృతదేహాలు వెలికితీసారు? ఇంకా ఎంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది? గోదావరిలో కూడా 144 సెక్షన్ పెట్టిన ఘనత మీ తుగ్లక్ @ysjagan ది. బోట్ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న వారికీ కనీసం మృతదేహాలను అందించలేని చేతగాని ప్రభుత్వం మీది.
— venkanna_budda (@BuddaVenkanna) October 2, 2019
స్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే శకుని @VSReddy_MP మామా నువ్వా చంద్రబాబు గారి గురించి మాట్లాడేది?పెద్ద పెద్ద విషయాలు మాట్లాడే ముందు ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు.గోదావరిలో మీ ప్రభుత్వం ముంచేసిన బోట్ లో ఎంత మంది ఉన్నారు? వరద ఉన్నప్పుడు బోట్ వెళ్లడానికి అనుమతి ఇచ్చిన మంత్రి ఎవరు ?
— venkanna_budda (@BuddaVenkanna) October 2, 2019