నల్ల దుస్తులతో నేడు: రాజధానిలో ఎమ్మెల్యేలు కనబడట్లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మూడు రాజధానుల ప్రకటన తర్వాత రాజధాని ప్రాంతల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తుళ్లూరులో ఇవాళ(24 డిసెంబర్ 2019) 7వరోజు రైతులు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. రైతులు వేసుకున్న టెంట్‌లను పోలీసులు తొలగించగా.. ఉదయం నుంచి మళ్లీ రైతులు టెంట్‌లు ఏర్పాటు చేసుకున్నారు.
ఇవాళ రైతులు నల్ల దుస్తులు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా రూపొందిస్తామన్న వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు. మరోవైపు వంటా-వార్పు కార్యక్రమాన్ని కూడా రోడ్లపై నిర్వహించనున్నారు. మరోవైపు రాజధాని ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై పోలీస్ స్టేషన్లలో కనబడట్లేదంటూ కంప్లైంట్లు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో పదిహేను మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కృష్ణాజిల్లాలోనూ 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరెవరూ స్పందించపోవడంపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.