మోడీ కరుడుగట్టిన ఉన్మాది, జగన్ సైకో : విరుచుకుపడ్డ చంద్రబాబు
అమరావతి : ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ తో పాటు ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ కరుడుగట్టిన ఉన్మాదిలా,

అమరావతి : ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ తో పాటు ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ కరుడుగట్టిన ఉన్మాదిలా,
అమరావతి : ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ తో పాటు ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ కరుడుగట్టిన ఉన్మాదిలా, జగన్ సైకో లా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలో క్రిస్టియన్ ఫాదర్లు, మత బోధకులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రధాని మోడీపై సీరియస్ అయ్యారు. నా ఇంటికి వచ్చే వాళ్లపై నిఘా పెడుతున్నారు అని చంద్రబాబు ఆరోపించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిపై నిఘా పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రిస్టియన్లు, ముస్లింలపై దాడులు చేస్తే ఓట్లు వస్తాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మనం ఏం తినాలో, ఏం మాట్లాడాలో కూడా వీళ్లే డిక్టేట్ చేస్తారా? అని మండిపడ్డారు. మోడీ దుర్మార్గాలపై తిరగబడ్డ తొలి నాయకుడిని నేనే అని చంద్రబాబు చెప్పారు. జగన్.. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో భేటీ అయ్యారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం కుర్చీ కోసం జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని.. కేసుల మాఫీ కోసం మోడీతో.. ఆస్తుల కోసం కేసీఆర్ తో లాలూచీ పడ్డారని చంద్రబాబు విమర్శించారు.