బాపట్ల వైసీపీలో విభేదాలు : కోన v/s చీరాల గోవర్థన్ రెడ్డి

బాపట్ల వైఎస్ ఆర్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. బాపట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి వ్యతిరేకంగా ఒరుగుంట్ల రెడ్ల సంఘం ఏకమయ్యింది. రఘుపతికి టిక్కెట్ ఇవ్వొద్దంటు రెడ్ల సంఘం ర్యాలి చేపట్టింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థన్ రెడ్డి వైసీపీ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గోవర్థన్ రెడ్డి టీడీపీ నేతలతో టచ్ ఉన్నారనీ..వారితో మంతనాలు జరుపుతున్నారనీ సమాచారం. గోవర్థన్ కు బాపట్ల సీట్ ఇచ్చేందుకు టీడీపీ కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
Read Also : ముహూర్తం ఫిక్స్ : వైసీపీని ఓడించటమే లక్ష్యం.. వంగవీటి రాధా
బాపట్ల నియోజకవర్గంలో భారీ ఎత్తులో రెడ్డి సామాజిక వర్గం వారి ఓట్లు ఉన్నాయి. దీంతో గోవర్థన్ రెడ్డికే పార్టీ టిక్కెట్ ఇవ్వాలనే డిమాండ్ రెడ్ల సంఘం తెరపైకి తెచ్చింది. దీనికి గోవర్థన్ రెడ్డి వెనుక ఉండి నడిపిస్తున్నారని కోన వర్గం ఆరోపిస్తోంది. కాగా గోవర్థన్ రెడ్డి మాత్రం అజ్ఞాతంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకపక్క కోనకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తునే మరోపక్క పార్టీ టిక్కెట్ రాకుంటే ప్రత్నామ్నాయంగా టీడీపీలోకి వెళ్లేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నారు గోవర్థన్ రెడ్డి.
ఈ క్రమంలోనే గోవర్థన్ రెడ్డి టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లుగా సమాచారం. అంసెబ్లీ నియోజకవర్గాలలో ఇంచార్జ్ లను తరచు మారుస్తున్న వైసీపీ అధినేత జగన్ వ్యవహారంతో నియోజక వర్గాలలో విభేదాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు కోన రఘుపతికి వ్యతిరేకంగా గోవర్థన్ రెడ్డిని తెరమీదకు రావడంతో బాపట్ల నియోజకవర్గం వైసీపీలో ఒక్కసారిగా విబేధాలు తెరపైకి వచ్చాయి.
Read Also : వైసీపీ మమ్మల్ని నిలువునా ముంచేసింది : తిప్పారెడ్డి భార్య