భోగాపురం ఎయిర్ పోర్టుకి శంకుస్థాపన

భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 10:12 AM IST
భోగాపురం ఎయిర్ పోర్టుకి శంకుస్థాపన

భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

విజయనగరం : భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు అనుకూలంగా భోగాపురం ఎయిర్ పోర్ట్, ఇచ్చాపురం నుంచి భోగాపురం వరకు బీచ్ రోడ్డు అభివృద్ధి చేస్తామని చెప్పారు. 18 నెలల్లో ఓర్వకల్లు విమానాశ్రయం పూర్తి చేశామని పేర్కొన్నారు. గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయాన్ని వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. విజయనగరంలో 129 ఎకరాల్లో గురజాడ అప్పారావు వర్సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. 3 అంతర్జాతీయ విమానాశ్రయాలున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని అన్నారు. 

విజయనగరం జిల్లాను అన్ని జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్ లో విజయనగరం, భోగాపురం కలిపిసోతాయని తెలిపారు. ఈ ప్రాంతం నుంచే విదేశాలకు కూరగాయలు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. గిరిజన యూనివర్సిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

రూ.14 వేల కోట్లు ఖర్చు అవుతున్నా.. వెనకడుగు వేయకుండా పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు త్వరలో స్మార్ట్ ఫోన్ లు ఇస్తున్నామని తెలిపారు. రైతులకు ఎకరాకు రూ.10 వేలు సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు.