రాజధానిలో 4070 ఎకరాలను చంద్రబాబు బినామీలు కొన్నారు : సీఎం జగన్

అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి చుట్టూ చంద్రబాబు బినామీలతో భూములు కొన్నారని సీఎం జగన్ విమర్శించారు. రాజధానిలో 4 వేల 70 ఎకరాలను చంద్రబాబు బినామీలు కొన్నారని ఆరోపించారు.

  • Published By: veegamteam ,Published On : December 17, 2019 / 01:03 PM IST
రాజధానిలో 4070 ఎకరాలను చంద్రబాబు బినామీలు కొన్నారు : సీఎం జగన్

Updated On : December 17, 2019 / 1:03 PM IST

అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి చుట్టూ చంద్రబాబు బినామీలతో భూములు కొన్నారని సీఎం జగన్ విమర్శించారు. రాజధానిలో 4 వేల 70 ఎకరాలను చంద్రబాబు బినామీలు కొన్నారని ఆరోపించారు.

అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి చుట్టూ చంద్రబాబు బినామీలతో భూములు కొన్నారని సీఎం జగన్ విమర్శించారు. రాజధానిలో 4 వేల 70 ఎకరాలను చంద్రబాబు బినామీలు కొన్నారని ఆరోపించారు. మంగళవారం (డిసెంబర్ 17, 2019) అమరావతి రాజధానిపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బినామీలు ఏ రకంగా భూములు కొన్నారో వివరించడం జరిగిందన్నారు.

రాజధానిపై కేవలం 5 వేల 800 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. రాజధానికి రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు చెప్పారని… కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.5 వేల 800 కోట్లు మాత్రమే ఖర్చు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. దీనిపై వడ్డీనే ఏడాదికి రూ.770 కోట్లు అవుతోందన్నారు. రాజధానిలో రూ.లక్ష కోట్ల పెట్టుబడికి ఎక్కడి నుంచి అప్పులు తేవాలని ప్రశ్నించారు.

53 వేల ఎకరాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఎకరానికి రూ.2 కోట్లు కావాలన్నారు. మొత్తంగా లక్షా 9 వేల కోట్లు అవసరమన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు రాజధానికి ఖర్చు చేసింది కేవలం 5 వేల 800 కోట్లేనని తెలిపారు. 53 వేల ఎకరాల అభివృద్ధికి లక్ష కోట్లు కావాలన్నారు. 

ఏపీలో స్కూల్స్ శిథిలావస్థలో ఉన్నాయన్నారు. ఆస్పత్రుల్లో ఎలుకలు కరిచి రోగులు చనిపోయిన పరిస్థితి చూశామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు కావాలన్నారు. పోలవరం నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. దాని కోసం రూ.60 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా చేశారని చెప్పారు.