మహిళల పేర్ల మీదే ఇళ్ల పట్టాలు : సీఎం జగన్
ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలను మహిళల పేర్ల మీదే రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు.

ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలను మహిళల పేర్ల మీదే రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు.
ఉగాది నాటికి 25లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలను మహిళల పేర్ల మీదే రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సాధికార సర్వేకు, ఇళ్ల పట్టాల వ్యవహారానికి లింక్ పెట్టొద్దని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే స్థలం వారి ముఖాల్లో సంతోషాన్ని నింపాలని సీఎం జగన్ అన్నారు.
లాటరీ పద్ధతి ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు
25 లక్షల మంది మహిళల పేర్ల మీద రూ.10 స్టాంపు పేపర్ల మీద ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. లాటరీ పద్దతి ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు ఉంటుందన్నారు. తాను గ్రామాల్లో పర్యటించేటప్పుడు ఆ ఊరిలో ఇంటి స్థలం లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా? అని అడిగితే ఎవరు చెయ్యత్త కూడదన్నారు. ఎవరి వల్ల కూడా అన్యాయం జరిగిందన్న మాట వినిపించకూడదని చెప్పారు. ఇళ్ల పట్టాలు ఇవ్వదలచుకున్న స్థలాలను ఖరారు చేసే ముందు లబ్ధిదారుల్లో మెజార్టీ ప్రజలు దీనికి అంగీకారం తెలపాలన్నారు. మనకు ఓటు వేయకపోయినా పర్లేదు.. వారికి మంచి జరగాలన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అన్నారు.
స్పందన కార్యక్రమంపై సీఎం సమీక్ష
సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల అమలుపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. స్పందన కార్యక్రమంలో వచ్చే దరఖాస్తుల్లో 60శాతం రేషన్, పెన్షన్, ఇళ్ల పట్టాలకు సంబంధించినవేనని సీఎం జగన్ చెప్పారు. స్పందనలో అధికారులు బాగా పని చేశారని ప్రశంసించారు. గ్రామ సచివాలయాల్లో పెన్షన్లు, బియ్యం కార్డులకు సంబంధించిన అర్హుల జాబితాలను ప్రదర్శించారా? లేదా? అని ఆరా తీశారు.
ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే పింఛన్లు
అలాగే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటికే పింఛన్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని జగన్ ప్రకటించారు. ఫిబ్రవరి 15 నుంచి 21వ తేదీ వరకూ కొత్త పెన్షన్ కార్డులు, కొత్త బియ్యం కార్డుల పంపిణీ ఉంటుందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు కేవలం 72 గంటల్లో అందించాలని నిర్దేశించుకున్నామని సీఎం చెప్పారు. 541 సేవలు ఎన్ని రోజుల్లో అందుతాయో గ్రామ సచివాలయాల్లో జాబితా ప్రదర్శించాలని ఆదేశించారు. ఇక కంటి వెలుగు మూడో విడతను ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించాలని ఆదేశించారు.