యాదాద్రిలో కేసీఆర్ : ఆలయ నిర్మాణ పనుల పరిశీలన

నల్గొండ: సీఎం కేసీఆర్‌... యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వడాయిగూడెం చేరుకున్న సీఎం.. అక్కడి

  • Published By: veegamteam ,Published On : February 3, 2019 / 10:32 AM IST
యాదాద్రిలో కేసీఆర్ : ఆలయ నిర్మాణ పనుల పరిశీలన

Updated On : February 3, 2019 / 10:32 AM IST

నల్గొండ: సీఎం కేసీఆర్‌… యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వడాయిగూడెం చేరుకున్న సీఎం.. అక్కడి

నల్గొండ: సీఎం కేసీఆర్‌… యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వడాయిగూడెం చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో యాదాద్రికి చేరుకున్నారు. అనంతరం బాలాలయంలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కలియతిరిగి పనులను పరిశీలించారు. అంతకుముందు.. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం.. ఆలయ పునర్నిర్మాణ పనుల్ని పరిశీలించారు.

 

ఆలయ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురుగోతిపై కేసీఆర్‌ సమీక్షించారు. ప్రధానాలయం, వ్రత మంటపం, శివాలయం పనుల పురోగతిని ఆరా తీశారు. కేసీఆర్‌తో పాటూ ఎంపీ సంతోశ్ కుమార్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, మర్రి జనార్ధన్ రెడ్డి, గొంగిడి సునీత యాదాద్రి వెళ్లారు.

 

యాదాద్రి ఆలయ పునర్‌ నిర్మాణ పనుల్లో పాలుపంచుకోవడం తన అదృష్టమని ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌ సాయి అన్నారు. సీఎం కేసీఆర్, ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి సూచనల మేరకు డిజైన్లు రూపొందించామని.. ఆ దిశగానే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అన్ని పనులు ఆగమశాస్త్రానికి అనుగుణంగానే జరుగుతున్నాయని తెలిపారు.