రెండు రోజుల ఢిల్లీ టూర్‌కు సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవాళ(21 అక్టోబర్ 2019) ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం జగన్ అక్టోబర్ 22వ తేదీన ఢిల్లీలో ఉంటారని సీఎం కార్యాలయం అధికారులు వెల్లడించారు. 21వ తేదీన ఉ.10.05 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి సీఎం మధ్యాహ్నం 12.05గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జగన్ భేటి అవుతారు. కేంద్ర మంత్రులతో మాట్లాడి రాత్రికి ఢిల్లీలోనే జగన్ బసచేస్తారు. 22వ తేదీ మ.3.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుని తర్వాత అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు జగన్.
సోమవారం ఉ.8గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి సీఎం జగన్ హాజరై పోలీసు అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు సీఎం జగన్.