కంగనాతో విజయేంద్రుడు : మన సినిమా హిట్ కావాలమ్మా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మంచి నటి అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, అప్పుడప్పుడూ ముక్కు సూటిగా మాట్లాడుతూ విదాలకు తెరతీస్తుందనీ, దర్శకుల పనిలో కలగజేసుకుంటుందనీ ఆమె గురించి పలు వార్తలు వినబడుతుంటాయి. అయితే ఇప్పుడు కంగనా చేసిన ఒకపని గురించి, బాలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
కంగనా మెయిన్ లీడ్‌గా, వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా, మణికర్ణిక.. దర్శకుడు క్రిష్‌తో పాటు, కొంత భాగాన్నికంగనా కూడా డైరెక్ట్ చేసింది. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ బాంబేలో జరిగింది. ఆ ఈవెంట్‌లో కంగనా, ప్రముఖ రచయిత, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కి పాదాభివందనం చేసింది. ఆమెలోని పెద్దలను గౌరవించే గుణాన్ని చూసి, అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. మణికర్ణిక సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథనందించాడు. టీజర్‌లో డైరెక్టర్‌గా క్రిష్ పేరు వేసిన కంగనా, ట్రైలర్‌లో మాత్రం క్రిష్‌తో పాటు, తన పేరుని కూడా వేసుకుంది. దాంతో, మన తెలుగు ఆడియన్స్ ఆమెపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, కంగనా, విజయేంద్ర ప్రసాద్ కాళ్ళకి దణ్ణం పెట్టడం సినీ వర్గాల్లో, తెలుగు ప్రేక్షకుల్లో చర్చకు దారి తీసింది.