కరోనా కలకలం..ఖమ్మం ఆర్టీసీ బస్సులు..డిపోలలో కెమికల్స్‌తో క్లీనింగ్

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 06:30 AM IST
కరోనా కలకలం..ఖమ్మం ఆర్టీసీ బస్సులు..డిపోలలో కెమికల్స్‌తో క్లీనింగ్

Updated On : March 5, 2020 / 6:30 AM IST

తెలంగాణలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండటంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ఆర్టీసీ బస్సులు ప్రధాన సాధనాలుగా ఉన్నాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు ఆర్టీసీ బస్సులోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా కలకలం రేగటంతో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో  ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ బస్సులను..డిపోలు..బస్ స్టాండ్ లలో పరిశుభ్రతను పాటిస్తున్నారు. 

బస్సుల్లో సీట్లను, స్టీరింగ్ ను స్పిరిట్, క్రిమిసంహారక మందులతో క్లీన్ చేస్తున్నారు. అలాగే డిపోల్లో ప్రయాణీకులు కూర్చునే బెంచ్ లను..వారి తిరిగే ప్రాంతాలను క్లీన్ చేయిస్తున్నారు. అలాగే డిపోల్లో ఫ్లోరింగ్ లను కూడా నిరంతరం డెట్టాల్ వేసి క్లీన్ చేస్తున్నారు. 

చైనా నుంచి ప్రపంచ  దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్ భారత్ లో కూడా హల్ చల్ చేస్తోంది.ఇప్పటి వరకూ భారత్ లో 29 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర మంత్రి హర్షవర్థన్ పార్లమెంట్ లో ప్రకటించారు. వీరిలో ముగ్గురు వ్యక్తుల ఆరోగ్యం బాగానే ఉండటంతో వారిని డిశ్చార్జ్ చేశారని తెలిపారు. ఢిల్లీ, ఆగ్రా, రాజస్ధాన్, తెలంగాణలో కరోనా   పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా వైరస్ పై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నామని ఎవ్వరూ భయపడవద్దనీ..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రి హర్షవర్థన్ పార్లమెంట్ లో మాట్లాడుతూ..తెలిపారు. 

See More :

 కరోనా వైరస్ – భయపడకండి.. జాగ్రత్తగా ఉండండి.. మహేష్ ట్వీట్

• పశ్చిమగోదావరిలో తెలంగాణ కండక్టర్‌కు కరోనా లక్షణాలు

• కరోనా ఎఫెక్ట్ – మూతపడనున్న థియేటర్లు?

• క‌రోనాకే వార్నింగ్ ఇచ్చిన వర్మ