దగ్గినా, తుమ్మినా శిక్ష తప్పదు..కుళ్లు జోకులేస్తే ఇంటికెళ్లాల్సిందే..

కరోనా వైరస్ కారణంగా ఇన్ని రోజుల నుంచి మూతపడ్డవి అన్నీ ఒక్కక్కటిగా తెరుచుకుంటున్నాయి. పిల్లలకు పాఠశాలలు కూడా తెరుస్తున్నారు. యూకేలో నిన్నటి నుంచే బడులు పున: ప్రారంభం అయ్యాయి.
స్కూల్ కు లేట్ గా వస్తే ఫైన్ వేస్తారు..యూనిఫాం వేసుకోకపోయినా..హోం వర్క్ చేయకపోయినా ఫైన్ వేస్తారు. కానీ తుమ్మితే ఫైన్..దగ్గితే ఫైన్ అంటే ఎలా? ఇలాగైతే మా పిల్లల్ని స్కూల్ కు ఎలా పంపిస్తామండీ..కట్టే ఫీజులకంటే తమ్మినా..దగ్గినా ఫైన్ అంటే ఎలా అని తల్లిదండ్రులు కోపగించుకోవటం కూడా న్యాయమే. కానీ ఇది కష్టాల కాలం..అదేనండీ కరోనా కాలం కదా..అందుకే స్కూల్లో పిల్లలు తుమ్మినా..దగ్గినా..ఫైన వేస్తామంటోంది ఓ స్కూల్ యాజమాన్యం..అలాగైతేనే మీ పిల్లల్ని స్కూల్ కు పంపించండి అని చెబుతోంది.
యూకేలోని తూర్పు ససెక్స్‌లోని ఆర్క్ అలెగ్జాండ్ర అకాడమీ ‘కరోనా వైరస్ రెడ్ లైన్స్’పేరుతో స్కూల్లో ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. విద్యార్థులు కావాలని దగ్గినా, తుమ్మినా పనిష్మెంట్ ఇస్తామని ఫైన్ వేస్తామని ప్రకటించింది…కరోనా వైరస్ పై జోకులేసినా..అనుచితంగా మాట్లాడినా సరే ఫైన్ తో పాటు పనిష్మెంట్ కూడా ఇస్తామంటోంది.
తప్పనిసరిగా సోషల్ డిస్సెన్స్ ఉండాలని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను విద్యార్థుల ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే అలాంటి విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా స్కూలు నుంచి డిబార్ చేస్తామని స్కూల్ మేనేజ్ మెంట్ కరాఖండిగా చెప్పేసింది.
దగ్గు రాకపోయినా సరే కొంతమంది పిల్లలు కావాలని యాక్టింగ్ చేస్తూ తోటి పిల్లలను భయపెడుతున్నారనీ..కరోనా మీద కుళ్లు జోకులు వేస్తూ లేకిగా మాట్లాడుతున్నారని అటువంటివారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. పిల్లలు వీటిని పిల్లలు అలవాటు చేసుకుంటారో..లేదో గానీ స్కూల్ మేనేజ్ మెంట్ మాత్రం కచ్చితంగా చెప్పేసింది.
అంతేకాదు..స్కూలు నిబంధనలతో పాటు ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలను కూడా విద్యార్థులు పాటించాల్సిందే అంటోంది స్కూల్ మేనేజ్ మెంట్. ఇక కరోనా నిబంధనల్లో అత్యంత ముఖ్యమైనది ‘మాస్క్ ’తప్పనిసరి అని కూడా చెప్పింది. ముఖానికి మాస్క్ ధరించడం, విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు వాడాలని వీటిలో దేన్ని నిర్లక్ష్యం చేసినా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపింది.