లాజిక్ లెక్కలు.. గుడ్డు.. ఫన్నీ జోక్స్ : విమానంలో చెన్నై టీం హంగామా

లాజిక్ లెక్కలు.. గుడ్డు.. ఫన్నీ జోక్స్ : విమానంలో చెన్నై టీం హంగామా

Updated On : March 29, 2019 / 12:15 PM IST

ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) 3సార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తర్వాతి మ్యాచ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఓ కుటుంబ వాతావరణం ప్రతిబింబించేలా సందడి చేసే చెన్నై జట్టు ప్రయాణంలో చేసిన సరదా సన్నివేశాలతో చేసిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకుంది.  

మార్చి 31 ఆదివారం రాజస్థాన్‌తో చిదంబరం స్టేడియం వేదికగా తలపడనున్న సూపర్ కింగ్స్ జట్టు చెన్నైకు బయల్దేరింది. ఈ ప్రయాణంలో చెన్నై జట్టులో ఉన్న భారత సీనియర్ బౌలర్ మోహిత్ శర్మ అడిగిన సరదా ప్రశ్నలు అందరిలో నవ్వు పుట్టించాయి. 
Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు

సాక్షి ధోనీని 100లో నుంచి 10ని ఎన్ని సార్లు తీసెయొచ్చని అడిగిన ప్రశ్నకు… ఆమె 10 అని సమాధానమిచ్చింది. దానికి 100లో నుంచి 10ని ఒకసారే తీసేయగలం. తర్వాత 90లో నుంచి, 80లో నుంచి మాత్రమే తీసేయడం కుదురుతోందని చమత్కరించాడు. 

ఆ తర్వాత రవీంద్ర జడేజాను మరో ప్రశ్నగా గుప్తా జీ గార్డెన్‌లో శర్మ జీ కోడి గుడ్డు పెడితే అదెవరిదవుతోందని అడిగితే.. రవీంద్ర జడేజా కరెక్ట్‌గా సమాధానం చెప్పి మోహిత్ శర్మను బురిడీ కొట్టించాడు. ఎక్కడ గుడ్డుపెట్టినా అది కోడిదే అవుతుందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.  

మోనూ కుమార్ దగ్గరకు వెళ్లి.. సంవత్సరంలో కొన్ని నెలలు 31 రోజులు, కొన్ని నెలలు 30రోజులు ఉంటాయి. మరి 28 రోజులు ఎన్ని నెలల్లో ఉంటాయి. అని అడిగిన దానికి మోనూ.. పాపం ఒక నెల అని చెప్పాడు. దానికి అసలు సమాధానం ప్రతినెలలోనూ ఉంటాయి కదా.. మోనూ అని అతనిని ఆటపట్టించారు. 

రామ్ ఇంకా శ్యామ్ మధ్యలో ఏముంది.. అని కర్ణ్ శ్యామ్‌ను అడిగితే అతను చెప్పిన సమాధానం సరిపోలేదు. దానికి సమాధానం ‘ఇంకా’ అని తర్వాత చెప్పి నవ్వులు కురిపించాడు. ఇలా సరదా సన్నివేశాలతో కూడిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది. 

Read Also : గంగూలీని ఏడిపించొద్దంటోన్న సెహ్వాగ్